ఈ చిత్రంలో బ్రాహ్మణ పూజారిగా నటించిన ఆదిత్య ఓం తన నటనకు గాను రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు.రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అవార్డ్ పొందాడు.అలాగే ప్రైమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ముంబైలో ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నాడు.

Video Advertisement

Aditya Om 'Dahanam' Cinema

Aditya Om ‘Dahanam’ Cinema

తాజాగా ఈ చిత్రం యొక్క టీజర్ విడుదల అయ్యింది.ఈ చిత్రం 1980 నాటి కాలంలో సాగే కథతో తెరకెక్కించారు. స్వార్ధపరులైన కొందరు వ్యక్తుల నుంచి గుడిని కాపాడుకునే పూజారి పాత్రలో ఆదిత్య ఓం కనిపించబోతున్నాడు. ఈ సినిమా టీజర్ ను చూసినట్లయితే అప్పటి కుల వ్యవస్థ గురించి చూపించారు. ఆచారాన్ని నిష్టగా పాటించే పూజారికి శ్మశాన వాటికలో పనిచేసే అంటరానివాడైన ఒక తాగుబోతు మధ్య జరిగే సంభాషణల బట్టి రెండు విభిన్న సామాజిక నేపథ్యాలు మరియు వైవిధ్యాలు, విభిన్న జీవిత కోణాల నుండి వచ్చిన ఇద్దరి గురించి చెప్పే కథగా కనిపిస్తోంది.గ్రామీణ నేపథ్యంలో మానవ హక్కుల ఉల్లంఘన, పితృస్వామ్యం, కుల వివక్ష మరియు అగ్రవర్ణ సమాజం లాంటి వైఖరిని ‘దహనం’చిత్రంలో చూపించినట్టుగా తెలుస్తోంది.

Aditya Om 'Dahanam' Cinema

Aditya Om ‘Dahanam’ Cinema

నిర్మాతగా, సంగీత దర్శకుడిగానూ డా.పి సతీష్ కుమార్‌కు మంచి ప్రశంసలు లభించాయి. ఎఫ్ఎం బాబాయి,శాంతి చంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీని ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్ పై డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ అర్ బలరాం నిర్మించారు. ఈ చిత్రానికి ఎడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్ పి సతీష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర నిర్మాతలు త్వరలోనే ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

Dahanam Movie Details

Hero: Aditya Om

Heroin: Sony Reddy

Banner: Open Field Media

Producer: Dr.Satish Kumar Pethakamsetty

Director: Adari Murty Sai

Music Director: Satish Kumar

 

Watch & Enjoy Garalam Taginodu Lyrical Song Movie Dahanam.

Song Name: Garalam Taginodu
Lyrics & Music: Satish Kumar
Singer: Satish Kumar
Music Director: Satish Kumar