విశ్వక్ సేన్ కావాలనే ‘హిట్2’ ని పక్కన పెట్టాడా? అడివి శేష్ కామెంట్స్..!

విశ్వక్ సేన్ కావాలనే ‘హిట్2’ ని పక్కన పెట్టాడా? అడివి శేష్ కామెంట్స్..!

by kavitha

Ads

Tollywood: అడివి శేష్, మీనాక్షి చౌద‌రి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘హిట్2’. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ చిత్రానికి సీక్వెల్ గా  ‘హిట్ 2’ వస్తోంది. ఈ సినిమా నాచురల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణలో ‘వాల్ పోస్ట‌ర్ సినిమా’ బ్యాన‌ర్‌ పై  శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ‘హిట్’ కాంబినేషన్లోనే ఈ సినిమా రూపొందింది. కానీ ఇందులో హీరో హీరోయిన్లు మాత్రమే మారారు.

Video Advertisement

హిట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రుహాని శర్మ నటించారు. హిట్2 లో అడివి శేష్, మీనాక్షి చౌద‌రి నటించారు. అయితే హీరోయిన్ సంగతి ఎలా  ఉన్నప్పటికీ  హిట్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టిన విశ్వక్ ను హీరోగా మళ్ళీ ఎందుకు తీసుకోలేదు అనే సందేహం మాత్రం అందరిలోను కలిగింది. అయితే హిట్ సీక్వెల్ ని నెక్స్ట్ లెవెల్లో చేయాలని, తీసే ప్రతీ సీక్వెల్ కి హీరోని మార్చాలనే విశ్వక్ ను కాకుండా వేరే హీరోను తీసుకున్నట్లు డైరెక్టర్ శైలేష్ చెప్పుకొచ్చారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘హిట్’. హీరో నాని నిర్మాతగా మారిన ఈ సినిమాతోనే శైలేష్ కొలను దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. అయితే శైలేష్ కొలను ఒక డాక్టర్.ఆయనకు సినిమాలపై ఉన్న అమితమైన ఆసక్తి వల్ల దర్శకుడు అయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు.

adivi-sheshu

అయితే విశ్వక్ సేన్ కు ‘హిట్2’ కథ నచ్చకపోవడం వల్లే ఈ సినిమాలో నటించలేదని ఇన్సైడ్ టాక్. కాగా డైరెక్టర్ శైలేష్ ‘హిట్3’మూవీని కూడా అడివి శేష్ తోనే చేయబోతున్నాడు. అయితే ఈ విషయాన్నిహీరో అడివి శేష్ స్వయంగా తెలిపాడు. అడివి శేష్ నిన్న జరిగిన ‘హిట్2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని చెప్పాడు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ ఈ ట్రైలర్ దర్శకుడు శైలేష్‌కి, మూవీ యూనిట్ అందరికీ బిగ్గెస్ట్ సెలెబ్రేషన్ అని, ట్రైలర్ ని ఇంత బాగా కట్ చేసినందుకు శైలేష్ గారికి థాంక్స్. హిట్ యూనివర్స్‌లో సెకండ్ పార్ట్ చాలా కీలకమైంది.

‘హిట్ 3’ లో కూడా నన్ను భాగం చేసినందుకు శైలేష్‌కు థాంక్స్. అయితే నార్త్ ఆడియెన్స్ పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయండని అడిగేవారు. అందుకే నిర్మాత నాని గారితో మాట్లాడి, పాన్ ఇండియన్ వైడ్‌గా విడుదల చేయాలని నిర్ణయించాం. ఆడగగానే అంగీకరించిన నాని గారికి, ప్రశాంతి గారికి చాలా థాంక్స్. మరియు నాతో ఈ మూవీని నిర్మించినందుకు థాంక్స్ అని చెప్పారు.ట్రైలర్ లో ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేమ్, డైలాగ్‌కు అర్థం ఉంది. హీరోయిన్ మీనాక్షి గారు చాలా చక్కగా నటించారు. శ్రద్దా శ్రీనాధ్ గారు అద్భుతంగా నటించారు.

మేజర్‌లో చేసిన పాత్రకు ‘హిట్ 2’లో చేసిన పాత్రకు అస్సలు సంబంధం ఉండదు. ఈ పాత్ర కోసం నేనేమీ రీసెర్చ్ చేయలేదు.ఒకరి కోసం కాకుండా కథ, డైరెక్టర్, నిర్మాత నాని అందరి కోసం ఈ మూవీని చేశాను. డిసెంబర్ 2న హిట్ 2 విడుదల కాబోతుంది. అయితే అడివి శేష్ ‘హిట్3’ గూర్చి చెప్పాడు. కానీ,ఇప్పుడు శేష్ ఇచ్చిన స్పీచ్ తో ‘విశ్వక్ సేన్ తన ఇగో వల్లే హిట్ 2లో చేయలేదా? అనే సందేహాలను రేకెత్తించాడు. అసలు విషయం ఏమిటో తెలియాల్సి ఉంది..


End of Article

You may also like