Ads
సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు మనోజ్ బాజ్ పాయ్. తాను అనుకున్నవి సాధించడానికి ఎంతో కష్టపడ్డారు. ఎన్నో అవరోధాలను దాటుకుని వస్తే కానీ విజయాన్ని అందుకోలేదు. ఈయన ఒక రైతు కొడుకు. సెలవుల్లో మరియు స్కూల్ అయిపోయిన తర్వాత తన తండ్రితో పాటు పొలానికి వెళ్ళేవాడు. అలాగే తన తండ్రి కూడా మనోజ్ ని బాగా చదువుకోవాలని ఎంతగానో ప్రోత్సహించేవారు.
Video Advertisement
అతను డాక్టర్ అవ్వాలని తన తండ్రి అనుకున్నారట కానీ ఆయనకి మాత్రం చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వాలని అనుకున్నారట. సినిమాలు చూడడం ఎంతో ఆనందంగా అనిపించేది అని అంతే కానీ నేను హటాత్తుగా ఒక యాక్టర్ అయిపోలేదని ఆయన చెప్పారు. తన తల్లిదండ్రులతో పాటు సినిమాలు చూడడం వాటిని ఎంతగానో అందించడం చిన్నప్పటి నుండి వస్తున్నది అని చెప్పారు. ఇతనికి ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే హాస్టల్ కి పంపించేశారు. అప్పుడు కూడా సీనియర్లు ఏడిపించడం లాంటి వాటితో ఇబ్బంది పడ్డారు. 67వ నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఈయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది.
ఈయనకి ఎన్ఎస్డీ ఢిల్లీకి వెళ్లాలని అనిపించేది. దానికోసం ఎంతగానో ఎదురుచూశారట. అయితే మొదటి సారి, రెండవసారి, మూడవసారి కూడా ఈయనకి అతనికి అనుమతి లభించకపోవడంతో ఎంతో బాధపడ్డారు. పైగా ఎంతగానో ఏడ్చారట. సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించిందని అందుకనే తన స్నేహితులు అతని పక్కన పడుకుని ఒంటరిగా వదల్లేదని చెప్పారు.
ఆ తర్వాత అతనికి ఎన్ఎస్డీ లో అవకాశం లభించడం.. వెళ్లడం జరిగింది. అది అయిపోయిన తర్వాత బారీ జాన్ దగ్గర తాను కొంత కాలం పని చేశారని అప్పుడు కొద్దిగా సాలరీ వచ్చేదని చెప్పారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఎన్ఎస్డీ కి అతను వెళ్లిపోయారు. 1998 లో సత్య సినిమాలో నటించారు. ఆ తరువాత ఎన్నో సినిమాలు చేసి మంచి పాపులర్ నటుడిగా మారారు.
End of Article