వలస కూలీల కష్టాలు చూడలేక వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చిన సోనూసూద్ బాటలోనే..ఇప్పుడ నటి స్వరభాస్కర్ అడుగేసారు..ఇంతమంది వలసకూలిలు వారి ఇళ్లకు వెళ్లడానికి కష్టపడుతుంటే, నేను హాయిగా ఇంట్లో కూర్చోవడం సిగ్గుచేటు అని టైమ్స్ నౌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్న స్వరభాస్కర్.. వలసకూలీలను వారి ఇళ్లకు పంపే బాధ్యత తీసుకున్నారు.

Video Advertisement

ఇటీవల తన తల్లిని చూడడానికి బాంబే నుండి ఢిల్లీకి పయనమయి ఒంటరిగా  వెళ్లిన స్వరభాస్కర్..అక్కడి నుండి వలస కూలీలకు వారి ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. స్వరభాస్కర్ తో పాటు  కొందరు టీం గా ఏర్పడి.. సొంత ఊళ్లకు వెళ్లే వలసకూలీల లిస్టు తయారు చేశారు.దాని ప్రకారం ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడి వారందరికి ట్రైన్ టికెట్స్ వచ్చేలా చేసారు.ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏంటంటే  వలస కార్మికులకు చెప్పులను అందించారు స్వరభాస్కర్. 500 జతలను చెప్పులను స్వయంగా తానే వారికి అందచేశారు., ఇప్పటివరకు 1350మంది కార్మికులను ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల్లోని వారి  ఇళ్లకు పంపారు..

రోడ్లపైన, వీధుల్లో లక్షలాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మనం ఇంట్లో కూర్చోవడం సిగ్గుచేటు అని.. వలస కార్మికుల సంక్షోభం మన వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసిందని..స్వర తన ఇంటర్వ్యూలో చెప్పారు.. అంతేకాదు తనకు సాయం చేసిన ఆప్(AAP)ఎమ్మెల్యే దిలీప్ పాండేకి కృతజ్ణతలు తెలిపింది స్వర భాస్కర్

ఇప్పటివరకు 45వేల మంది వలస కూలీలకు స్వయంగా బస్సులను ఏర్పాటు చేసి వారి ఊర్లకు పంపించిన సోనూసూద్..ఇప్పుడు వారి కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ని ఏర్పాటు చేశారు.18001213711 ఇదే ఆ నంబర్..దీనికి రోజుకు కొన్ని వేల మెసెజెస్ , కాల్స్ వస్తున్నాయని సోనూ స్వయంగా ఒక వీడియో ట్వీట్ చేశాడు.. ఇలా కొంతమందిని మిస్ అవ్వోచ్చు కానీ నేను మా టీం  మమ్మల్ని కాంటాక్ట్ అయిన అందరికి సాయం చేయడానికి చూస్తున్నాం అని ట్వీట్ లో పేర్కొన్నాడు.. అలుపెరగకుండా వలసకూలీలకు కోసం పాటుపడుతున్న రియల్ హీరో..హ్యాట్సాప్..