Ads
ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టింది చైనాలోని వూహాన్ . 2019 డిసెంబర్ చివరి వారంలో అక్కడ తొలి కేసు నమొదవగా, తర్వాత పరిస్థితి విషమించింది.దాంతో వూహాన్ నగరం మొత్తం రెండు నెలల పాటు లాక్ డౌన్ లో ఉంది. ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ఎత్తివేసి, వూహాన్ నగరం వెలుగులు చూస్తోంది. అయితే మళ్లీ చైనా లాక్ డౌన్ ప్రకటించింది..కానీ ఈ సారి వూహాన్లో కాదు..మరో దిక్కున రష్యాకు అనుబంధంగా ఉన్న బార్డర్ ను మూసేసింది..ఎందుకంటే..
Video Advertisement
చైనాలో లాక్ డౌన్ ఎత్తేయడంతో జనాలు ఇతర ప్రాంతాల నుండి ఇళ్లకు వస్తున్నారు , పూర్తిగా కరోనా నెగటివ్ గా మారని వూహాన్ నగరంలో మళ్లీ కొత్తగా నమోదైన కేసులు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారివే.. అందులో రష్యానుండి వచ్చిన చైనీయుల్లో 40మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు.ఇప్పుడు మళ్లీ చైనాలో కరోనా కేసులు పెరగడం స్టార్టయింది. దాంతో 4,200 కిలోమీటర్లకు దూరంలో ఉన్న రష్యా బోర్డర్ ను చైనా పూర్తిగా మూసేసి, బోర్డర్ వెంబడే ఉన్న సూఫెన్ సిటీని సీజ్ చేసింది .
రష్యాలో దాదాపు1.60 కోట్లమంది చైనీయులు చిన్న చిన్న పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అక్కడ కరోనా కేసులు 10 వేలు దాటడంతో వారంతా ప్రాణభయంతో చైనాకు పారిపోయి వస్తున్నారు. ఇప్పటివరకు రష్యా నుండి చైనాకి వచ్చిన వారిలో 40మందికి పాజిటివ్ రావడంతో ,ఇంకెన్ని కేసులు పెరుగుతాయో పరిస్థితి మళ్లీ విషమం అవుతుందేమో అని ఎక్కడివాళ్లక్కడే ఉండిపోవాలని ఆదేశించింది. అంతేకాదు ఇదే విషయంపై రష్యా ప్రభుత్వంతో కూడా మాట్లాడింది.
సూఫెన్ కు 85 మైళ్లదూరంలోనే ఉండే రష్యాలోని వ్లాదివోస్టోక్ కు వస్తున్న చైనీయులు, అక్కడి నుంచి చైనాకు దొంగచాటుగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎవరైనా హోం క్వారంటైన్ రూల్స్ ఫాలో అవ్వకపోతే వారికి 10లక్షల రూబుళ్ల ఫైన్ వేస్తామని ప్రకటించింది. మరోవైపు సూఫేన్ నగరంలో ప్రజలు ఏ విధమైన నిబంధనలు పాటించాలో స్పష్టం చేసింది. మూడు రోజులకోసారి సరుకుల కోసం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటికి రావాలని, ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్లే రావాలని, అన్ని జాగ్రత్తలుతీసుకోవాలని అధికారులు రూల్స్ పెట్టారు. 70 వేల జనాభా ఉన్న సూఫెన్ లోనూ ఓ ఎమెర్జెన్సీ హాస్పిటల్ ను చైనా సిద్ధం చేస్తోంది. ఇది శనివారం నాటికి రెడీ అవుతుందని సమాచారం.
End of Article