Home Filmy Adda SRH కెప్టెన్ తో మహేష్ బాబు…ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో తెలుసా.?

SRH కెప్టెన్ తో మహేష్ బాబు…ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో తెలుసా.?

by Mohana Priya

ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు, ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్ పనిలో ఉన్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఇటీవల మహేష్ బాబు, రాజమౌళి, సినిమా ప్రొడ్యూసర్ కే ఎల్ నారాయణ గారు కలిసి దుబాయ్ కి వెళ్లి వచ్చారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ కూడా మార్చుకుంటున్నారు. గడ్డంతో, పెరిగిన జుట్టుతో కనిపిస్తున్నారు. లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా గురించి వివరాలు ప్రకటిస్తారు.

age difference between pat cummins and mahesh babu

అంత వరకు మహేష్ బాబు మీడియాకు దూరంగా ఉంటారు అనే వార్త వచ్చింది. బయట ఎక్కడా కనిపించరు అని అన్నారు. అయితే ఇటీవల, మహేష్ బాబు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్స్ తో ఒక ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో మహేష్ బాబు కొత్త లుక్ అయితే బయటికి వచ్చింది. ఇందులో మహేష్ బాబు, టీం ప్లేయర్స్ అందరితో కలిసి ఫోటోలు దిగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తో కూడా మహేష్ బాబు ఫోటో దిగారు. వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఒకే లాగా ఉన్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

age difference between pat cummins and mahesh babu

“ఇద్దరూ ఒకటే వయసు వారిలాగా కూడా ఉన్నారు” అని అంటున్నారు. అయితే వీళ్ళిద్దరికీ మధ్య చాలా సంవత్సరాల తేడా ఉంది. మహేష్ బాబు వయసు 48 సంవత్సరాలు. పాట్ కమిన్స్ మే 8వ తేదీ, 1993 లో పుట్టారు. అంటే ఇప్పుడు 30 సంవత్సరాల వయసు. వీళ్ళిద్దరికీ మధ్య 18 సంవత్సరాల వయసు తేడా ఉంది. కానీ ఈ ఫోటోలు చూస్తూ ఉంటే మాత్రం ఆ విషయం అసలు తెలియదు. దగ్గర దగ్గర వయసు వారి లాగానే కనిపిస్తున్నారు. దాంతో ఇంటర్నెట్ లో వెతికి, పాట్ కమిన్స్ కామెంట్స్ వయసు తెలుసుకున్న తర్వాత, “ఇద్దరికీ మధ్య 18 సంవత్సరాల వయసు తేడా ఉంది అంటే కూడా నమ్మబుద్ధి కావట్లేదు” అంటూ ఈ ఫోటో చూసిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : “సాయి పల్లవి”, “భానుప్రియ” తో పాటు… తమ “డాన్స్” తో గుర్తింపు సంపాదించుకున్న 14 మంది హీరోయిన్స్..!

You may also like