Ads
సినిమాలో స్టార్ గా నటించాలి అన్న ప్యాషన్ పిచ్చి ఉన్న యాక్టర్స్ ని చూసాం కానీ సినిమాలపై పిచ్చితో విదేశాల్లో వ్యాపారాన్ని కూడా పక్కనపెట్టి నిర్మాణ బాధ్యతలు వ్యవహరిస్తున్న వ్యక్తి అనిల్ సుంకర. అనిల్ బ్యానర్ అనే సంస్థ ద్వారా భారీ బడ్జెట్ తో సినిమాలను తీస్తూ ఇప్పటివరకు డిజాస్టర్స్నే చవి చూసాడు ఈ నిర్మాత.
Video Advertisement
ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి తీసిన సినిమాలన్నీ ఏ వన్ డిజాస్టర్స్ కావడంతో పెట్టిన పెట్టుబడి రూపాయి కూడా వెనక్కి రాలేదు. ఒక రూపాయి ఖర్చు పెడితే సరిపోతుంది అనుకున్న దగ్గర కూడా రెండు రెండు రూపాయలు పెట్టే మనస్తత్వం ఉన్న నిర్మాతగా ఈయనకి పేరు ఉంది. సోలో నిర్మాతగా సినిమాలు తీస్తే ఎన్నో పరాజయాలను, పరాభవాలను ఎదుర్కొన్నాడు అనిల్.
మరి ముఖ్యంగా మొన్న ఏజెంట్ డిజాస్టర్ తో మొత్తం చిత్రసీమ ఇతనిపై సానుభూతి ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో సామజవరగమన మూవీతో తొలిసారిగా అతను సక్సెస్‌ను రుచి చూశాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమా అంచనాలను మించి భారీ విజయాన్ని సాధించింది. శ్రీ విష్ణు సినీ కెరియర్ లో కూడా ఈ చిత్రం భారీ విజయంగా నిలిచింది.
వీకెండ్ హడావిడి తగ్గినప్పటికీ…సోమవారం కూడా ఈ సినిమా వసూళ్లు ఎక్కడ తగ్గింది లేదు. ఈ సినిమాపై పెట్టిన ప్రతి రూపాయికి మూడు రూపాయల లాభం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అనిల్ సుంకర నష్టపోయిన డబ్బుతో పోల్చుకుంటే సామజవరగమన కలెక్షన్స్ తక్కువ కావచ్చు. కానీ ఎడారిలో నడిచే ప్రయాణికుడికే ఒయాసిస్ విలువ తెలుస్తుంది అన్నట్లు ఇప్పటివరకు అపజయాల పాలైన అనిల్ కు మొదటి సక్సెస్ విలువ బాగా తెలుసు.
అనిల్ నుంచి వస్తున్న మరో భారీ చిత్రం మెగాస్టార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఆగస్టు 11న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఊహించిన విధంగా సక్సెస్ సంపాదిస్తే నిర్మాతగా అనిల్ సుంకర తిరిగి ట్రాక్‌లోకి వచ్చినట్లే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
End of Article