Ads
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రస్తుతం అన్ని రంగాలలో వినియోగిస్తున్నారు. ప్రవేశ పరీక్షలలో పాస్ అవడం దగ్గర నుండి కల్పిత పరిస్థితులతో కృత్రిమ దృశ్యాలను అభివృద్ధి చేయడం వరకు AI ప్రతి రంగంలోనూ ప్రభావం చూపుతోంది.
Video Advertisement
డిజిటల్ కళాకారులు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వినూత్నమైన దృశ్యాలను, ఆకర్షణీయమైన చిత్రాలను రూపొందిస్తున్నారు. తాజాగా డిజిటల్ కళాకారుడు సాహిద్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో AI ద్వారా రూపొందించిన ఆర్ట్‌వర్క్ ను పోస్ట్ చేశాడు. అయితే అవి ఏమిటి ఇప్పుడు చూద్దాం..
ఈ చిత్రాలలో ప్రతి రాష్ట్రం యొక్క సంప్రదాయం, సంస్కృతి, ఆహారం, అభివృద్ధిని చక్కగా చూపించారు. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. AI వివిధ రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రయాణాన్ని ఎంత అద్భుతంగా క్రియేట్ చేసిందో ఈ ఫోటోల ద్వారా చూడవచ్చు.
1. ఈ చిత్రాలలో కాన్పూర్, సూరత్, చెన్నై వంటి రాష్ట్రాలకు సంబంధించి ఫోటోలు. ఇవన్నీ జర్నీలో ఉండగా తీసినట్లుగా క్రియేట్ చేయడం జరిగింది.2. సూరత్ మెట్రోలో ప్రయాణికులను ఇలా చూపించారు. పైన వజ్రాలను AI సృష్టించింది.3. హర్యానా మెట్రోలో చాలా మంది తమ సంప్రదాయ వస్త్రధారణలో ఉండగా, వారి చేతుల్లో కర్రలు పట్టుకుని హర్యానా సంస్కృతిని ప్రదర్శిస్తున్నారు.4. చెన్నైమెట్రో అత్యంత ఆసక్తికరంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూర్చుని ప్రయాణం చేస్తుండటం కనిపిస్తుంది. 5. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సలిజం ఎక్కువ. అందువల్ల ఛత్తీస్‌గఢ్ మెట్రోలో ప్రయాణం ఈ విధంగా ఉంటుందని AI చిత్రాన్ని రూపొందించింది. 6. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సంప్రదాయాలకు చాలా విలువను ఇస్తారు. అందువల్ల కన్యాకుమారి మహిళలు మెట్రోలో ప్రయాణిస్తే ఈ విధంగా ఉంటుందని AI అంచనా వేసింది. 7. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అందువల్ల హైదరాబాద్ మెట్రోలో AI బిర్యానీ ఉన్నట్టుగా రూపొందించింది. 8. ఉత్తర ప్రదేశ్ లో దుండగులు నాటు తుపాకులతో తిరుగుతూ ఉంటారు. అందువల్ల యూపీ మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI అంచనా వేసింది.9. కోటా మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI ఫోటోను రూపొందించింది. 10. కోల్ కతా మెట్రోలో చేపలు పట్టుకుని ప్రయాణిస్తూన్నట్టుగా AI ఫోటోను రూపొందించింది. 11. బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధ వంటకం లిట్టి చోఖా. అందువల్ల అక్కడి మెట్రోలో లిట్టి చోఖా ఉన్నట్టుగా ఫోటోను AI రూపొందించింది. 12. బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అందువల్ల అక్కడి మెట్రోలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రయాణం చేస్తున్నట్టుగా ఫోటోను AI రూపొందించింది. 13. కాశ్మీర్ లో మంచు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాశ్మీర్ మెట్రోలో మంచు కూరుస్తున్నట్టుగా AI ఫోటోను రూపొందించింది. 14. రాజస్థాన్ ఎడారి, ఒంటెలకు ప్రసిద్ధి చెందింది. అందువల్ల రాజస్థాన్ మెట్రోలో ఎడారిలో ఒంటెలు ఉన్నట్లుగా AI ఫోటోను రూపొందించింది. 15. ఒడిశా మెట్రోలో ఈ విధంగా ఉంటుందని AI ఫోటోను రూపొందించింది.
16. నాగ్పూర్ ను ఆరెంజ్ సిటీ అని కూడా అంటారు. అందువల్ల నాగ్పూర్ మెట్రోలో ఆరెంజ్ లు ఉన్నట్టుగా AI ఫోటోను రూపొందించింది. AI రూపొందించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు ఈ చిత్రాలపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI)” ద్వారా సృష్టించిన… 13 హీరోల ఫోటోలు..!
End of Article