కరోనా పేషెంట్ ప్రాణాలు కాపాడడం కోసం ఆ డాక్టర్ ఎంతటి సాహసం చేశారంటే..

కరోనా పేషెంట్ ప్రాణాలు కాపాడడం కోసం ఆ డాక్టర్ ఎంతటి సాహసం చేశారంటే..

by Anudeep

Ads

కరోనా మహమ్మారి తో యావత్ మానవ ప్రపంచం అలుపెరుగని పోరాటం చేస్తోంది.దేశాల  ప్రధాన మంత్రులు, అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి మొదలుకొని రోడ్లు,రైలు పట్టాలపై ప్రాణాలను పారేసుకుంటున్న వలసకూలీల వరకూ కరోనాపై తమ తమ స్థాయుల్లో యుధ్దాలు చేస్తున్నవాళ్ళే…వీరందరి సమరం ఒక ఎత్తైతే…కరోనా పంజా ధాటికి పడిపోయిన ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి డాక్టర్లు చేస్తున్న పోరాటం మరో ఎత్తు..కరోనా పేషెంట్స్ ప్రాణాలను కాపాడడం కోసం ఎంతటి సాహసానికి పూనుకుంటున్నారో తెలియాలంటే ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ..

Video Advertisement

ఢిల్లీకి చెందిన డాక్టర్ జహిద్ అబ్దుల్ మజీద్ ఎయిమ్స్ లో అత్యవసర కేసుల నిపుణుడుగా పనిచేస్తున్నారు.నాలుగు రోజుల క్రితం  కరోనా  పాజిటివ్ వచ్చిన పేషెంట్ ని  ఎయిమ్స్ ప్రధాన ఆసుపత్రి నుంచి ట్రామా సెంటర్  కు అంబులెన్స్లో  తరలిస్తున్నారు .ఇంతలో , ఆ పేషెంట్ ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ సమాచారం అందుకున్న డాక్టర్ జాహిద్ అక్కడికి చేరుకుని  అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడం గమనించాడు, అతడి గొంతులో అమర్చిన ఆక్సిజన్  ట్యూబు సరిగా ఇమడలేదని గుర్తించిన వెంటనే దాన్ని సరిగా అమర్చేందుకు ప్రయత్నించారు

కానీ, కళ్లకు అడ్డుగా ఉన్న కళ్లద్దాలతో సరిగా కనిపించకపోవడం, మరో వైపు అది తెల్లవారుఝాము ప్రాంతం చీకటిగా ఉండడం, అంబులెన్స్ లో వెలుతురు కూడా సరిగా లేకపోవడంతో డాక్టర్ జాహిద్ చేసేదేంలేక వెంటనే తన తలకు ఉన్న పిపిఇ కిట్ మాస్క్ ను తీసివేసి, ఆ పేషెంట్ కు ఆక్సిజన్ ట్యూబ్ ను సరిగ్గా అమర్చాడు. ఆ తర్వాత అతడికి ఊపిరి తీసుకోవడం సులువయింది.

ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో మనుషులందరూ భౌతిక దూరం పాటిస్తుంటే, అటువంటిది కరోనా పేషెంట్ కి అతి దగ్గరగా ఉండి , తన ప్రాణాలను లెక్క చేయకుండా జాహిద్ ఈ సాహసానికి ఒడిగట్టాడు..జాహిద్ కొంచెం ఆలస్యం చేసినా ఆ పేషెంట్ ప్రాణాలు పోయేవే..కానీ అతడికి ఆక్సిజన్ పైప్ సెట్ చేసే క్రమంలో జాహిద్ అతడికి చాలా దగ్గరగా ఎక్స్పోపోజ్ అయ్యాడు..దాంతో జాహిద్ ను 14రోజులు క్వారంటైన్లో ఉంచారు.

ప్రస్తుతం జాహిద్ కి  ఎటువంటి కరోనా లక్షణాలు లేవు, కాని ఇకపై కూడా ఉండకుండా తను త్వరగా బయటపడాలని తన ఫ్రెండ్స్ మరియు కొలీగ్స్ కోరుకుంటున్నరు..డాక్టర్ జాహిద్ చేసిన పని మంచిదే కానీ, కరోనాకి తెలియదు కదా అతడు చేసిన మంచి గురించి..అది ఎవరినైనా కాటేయడానికి సిద్దంగా ఉంటుంది.. “అప్పటికే అతను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని, అతడి ప్రాణాలు కాపాడటానికే సేఫ్టీ కిట్ తీసేసానని, ఐసోలేషన్ పూర్తయ్యాక మళ్లీ విదుల్లో జాయిన్ అవుతానని జాహిద్ తెలిపాడు.


End of Article

You may also like