Home Filmy Adda Aiswarya Rajesh: కోటి రూపాయల పారితోషికాన్నీ వద్దన్న హీరోయిన్.. ఈమె మరో సాయిపల్లవి..!

Aiswarya Rajesh: కోటి రూపాయల పారితోషికాన్నీ వద్దన్న హీరోయిన్.. ఈమె మరో సాయిపల్లవి..!

by Anudeep

ఎక్కువ పారితోషికం వస్తుందంటే కొందరు హీరోయిన్లు తమకు పాత్ర నచ్చినా.. నచ్చకున్నా చేసేస్తూ ఉంటారు. కానీ సాయిపల్లవి లాంటి కొందరు మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకం. వారు కేవలం కధలో తమ పాత్ర నచ్చితేనే ఎంచుకుంటూ ఉంటారు. వారు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. వ్యతిరేకంగా ప్రచారాలు చేయడానికి కోట్లు ఇచ్చినా ఒప్పుకోరు..

aiswarya rajesh

ఇపుడు ఈ జాబితా లోకి వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ కూడా చేరారు. తెలుగు లో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు, తమిళ సినిమాలు కలిపి దాదాపు పది సినిమాల వరకు ఉన్నాయి. తాజాగా ఆమెకు మరో ఆఫర్ వచ్చింది. దర్శక నిర్మాతలు కోటి రూపాయల వరకు ఆఫర్ చేస్తామని తెలిపారు. కానీ, కథ నచ్చని కారణం గా ఆమె అంగీకరించలేదట. కేవలం పది పదిహేను లక్షలకే సినిమాల్లో నటించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ.. ఇంత పారితోషికం వస్తున్నా కథ లో తన పాత్ర నచ్చలేదని ఆమె రిజెక్ట్ చేసారు. ఆమె వ్యక్తిత్వానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

You may also like