Ads
హాస్యాన్ని పండించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కమెడియన్లలో సునీల్ కూడా ఒకరు. సునీల్ గురించి మనం కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశారు సునీల్. అందులో అందాల రాముడు కూడా ఒకటి. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ సునీల్ సరసన నటించారు. ఈ సినిమాలో ఆకాష్ కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా 2006 లో విడుదల అయ్యింది.
Video Advertisement
సునీల్ కి ఈ సినిమా మంచి హిట్ ని తీసుకు వచ్చింది. లక్ష్మీ నారాయణ డైరెక్షన్ లో ఆర్బీ చౌదరి నిర్మాతగా ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. ఆర్తి అగర్వాల్ సునీల్ కి జోడిగా నటించడం వలన సినిమా అద్భుతమైన హిట్ అందుకుంది. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను చెప్పారు ఆకాశ్. మరి ఆకాష్ చెప్పిన ఆ విషయాల గురించి చూద్దాం. అందాల రాముడు సినిమాలో సునీల్ కోసం నటించానని ఆకాష్ అన్నారు.
అయితే అందాల రాముడు లో ఆర్తి అగర్వాల్ తో నాకు ఒక సాంగ్ ఉండాలి కానీ ఆ సాంగ్ సునీల్ వద్దని చెప్పారని డైరెక్టర్ అన్నారని ఆకాశ్ చెప్పారు. ఇది తమిళ్ రీమేక్. కాబట్టి తమిళ్ సినిమాని చూసుకున్నట్లయితే ఒక పాట ఉండాలి. డైరెక్టర్ ని ఎందుకు సాంగ్ లేదు అని అడిగితే.. సునీల్ వద్దని చెప్పారని డైరెక్టర్ తనతో అన్నారట.
ఆ సమయంలో నాకు చాలా బాధ కలిగిందని ఆకాష్ చెప్పారు. షూటింగ్ సమయంలో సునీల్ భయ్యా నిన్ను లైఫ్ లో మర్చిపోలేనని సునీల్ చెప్పేవారని.. కానీ అలా చెప్పిన ఆయన ఇలా చెప్పడం నచ్చలేదని అన్నారు. అలానే సినిమా సక్సస్ అయిన తర్వాత తన ఫోటో కూడా వేయలేదని ఆకాష్ బాధపడ్డారు.
End of Article