Ads
అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలుపెట్టిన పూరి జగన్నాథ్ ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి టాప్ డైరెక్టర్లల లిస్టులో ఒకరిగా నిలిచారు. ఇడియట్, పోకిరి, అమ్మానాన్న తమిళ అమ్మాయి ఇలా ఎన్నో చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన దర్శక ప్రతిభ ఏంటో చూపించారు పూరి జగన్నాథ్.
Video Advertisement
ఈ మధ్యకాలంలో ఒక వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేస్తుంది. పూరి జగన్నాథ్ తన ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాడు అని, అదే విధంగా హీరోయిన్ ఛార్మి తో రిలేషన్ షిప్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణాల వల్ల అతని భార్య లావణ్య ఆయనకు విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ నటించిన చోర్ బజార్ ఈ నెల 24న థియేటర్ లోకి విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లో ఆకాష్ కు తన తండ్రి పూరిజగన్నాథ్ విడాకుల గురించి ప్రశ్నలు తలెత్తాయి.
నాన్న అమ్మను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగగానే సరే అని ఇంట్లో నుంచి ఒంటరిగా వచ్చేసింది. అప్పుడు నాన్న విలువ కేవలం 200 రూపాయలు మాత్రమే. రేపటి పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించకుండా నాన్న కోసం ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అమ్మ ఆయనకు ఎలా విడాకులు ఇస్తుంది.
ఇప్పటి కూడా నాన్న అన్ని కష్టాల్లోనూ అమ్మే సపోర్ట్ గా ఉంటుంది. అంటూ పూరి జగన్నాథ్ మరియు ఆయన భార్య విడాకులపై వచ్చిన పుకార్లకు చెక్ పెట్టేసాడు ఆకాష్.
End of Article