Ads
అఖండ సినిమాతో బాలకృష్ణ ఓ రేంజ్ లో రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. అఖండ బంపర్ హిట్ అవ్వడంతో బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరో వైపు కోవిడ్ కష్ట కాలంలో సినిమా రిలీజ్ కు వెనుకంజ వేస్తున్న సమయంలో అఖండ సినిమా రిలీజ్ అయ్యి బంపర్ హిట్ కొట్టింది.
Video Advertisement
అంతేకాదు.. ఆ కష్టకాలంలో సినిమా రిలీజ్ చేసుకుని లాభాలు సాధించవచ్చు అని ఇతర సినిమాలకు ధైర్యాన్ని కూడా ఇచ్చింది. ఇటీవల రిలీజ్ అయినా కెజిఎఫ్ పార్ట్ టూ కూడా మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఓ స్థాయిలో కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉండేలా చూసుకున్నారు. అయితే.. సెకండ్ పార్ట్ క్లైమాక్స్ అయిపోయాక థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది అని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చారు.
దీనితో థర్డ్ పార్ట్ విషయమై కెజిఎఫ్ అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా కెజిఎఫ్ 3 పై చాలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా కెజిఎఫ్ పార్ట్ 3 అంటూ వైరల్ అవుతున్న ఈ మీమ్ ను చూడండి. కెజిఎఫ్ క్లైమాక్స్ లో అఖండ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో చెప్పేస్తున్నారు. పార్ట్ 2 క్లైమాక్స్ లో హీరో గోల్డ్ తో కలిసి నీటిలో పడిపోతాడు. అయితే ఆ తరువాత ఏమి జరుగుతుందో తెలియాలంటే పార్ట్ 3 చూడాలి. అప్పుడే అఖండ ఎంట్రీ ఇచ్చి రాఖి భాయ్ ని కాపాడతాడు. అప్పుడు పార్ట్ త్రీ స్టార్ట్ అవుతుంది అంటూ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
End of Article