కరోనా ఐసొలేషన్ వార్డ్ లో అసలు ఏం జరుగుతుంది..? వీడియో బయట పెట్టిన యువకుడు…మీరే చూడండి!

కరోనా ఐసొలేషన్ వార్డ్ లో అసలు ఏం జరుగుతుంది..? వీడియో బయట పెట్టిన యువకుడు…మీరే చూడండి!

by Anudeep

కరోనా వైరస్ పేరు వినపడినప్పటినుండి మనకి మరో పదం కూడా వినపడుతుంది అదే ఐసోలేషన్లో ఉంచడం. ఐసోలేషన్ కి తరలించారు , ఐసోలేషన్లో ఉంచారు  , పద్నాలుగు రోజులు ఐసోలేషన్లో ఉన్నారు అంటూ.. ఇంతకీ ఐసోలేషన్లో ఉంచడం అంటే ఏంటి? అలా ఉంచినప్పుడు అక్కడ ఉన్న పేషెంట్స్ ఏం చేస్తారు? ఎలా ఉంటారు ? ఏం తింటారు.. తదితర వివరాలన్నింటిని వీడియో తీసి పోస్టు చేశాడు ఒక కరోనా పేషెంట్.

Video Advertisement

కరోనా కరోనా అని అందరూ భయపడుతుంటే, కరోనా సోకి వీడియో తీయడం ఏంట్రా అని ఆశ్చర్యపోకండి . తన పనే అది . తను ఒక యూట్యూబర్. కొత్త కొత్త విషయాల్ని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం తనకు అలవాటు . అలవాటు ప్రకారం ఐసోలేటెడ్ వార్డుకి తరలించాక ఏం తోచక అదే విషయాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు  ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 44 కరోనా కేసులు నమోదవగా , వారిలో ముగ్గురు కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఆ ముగ్గురిలో ఒకడైన షాకిర్ సుబాన్ , యూట్యూబర్. యూ ట్యూబ్‌లో ‘మల్లూ ట్రావెలర్’ పేరుతో వీడియోలను పోస్టు చేస్తూ ఉంటాడు. ఐసోలేషన్లో ఉంచడం అంటే ఒంటరిగా ఉంచడం, వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకునే జాగ్రత్త.సుబాన్ తన వీడియోలో క్వారంటీన్ పీరియడ్‌ అంటే 14 రోజుల పాటు ఒక వ్యాదిగ్రస్తున్ని ప్రత్యేకంగా ఎలా ఉంచుతారో వివరించారు.

ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరలైంది , హాస్పిటల్లో బెడ్ పై కాలు మీద కాలేసుకుని పడుకున్న ఒక పేషెంట్ ఫోటో అది, కరోనా తీసుకొచ్చి ఎంత దర్జాగా కూర్చున్నాడో అని క్యాప్షన్ కూడా తగిలించారు ఆ ఫోటోకి. కానీ వాస్తవం ఏంటంటే ఐసోలేషన్ విభాగంలో అంత ఫ్రీడమ్ గా ఉండడానికి ఉండదని ,సినిమాల్లో చూపించినట్టుగా అస్సలు  ఉండదని, పేషెంట్ బెడ్ పైనే ఉంటాడనేది పూర్తిగా అవాస్తవం, ఇరవై నాలుగ్గంటలూ డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది.

ఐసోలేషన్ వార్డుకి చేరుకున్నదగ్గరనుండి  ఖాళీ బస్సులో ప్రయాణించే వరకూ గల అన్ని విషయాలను వీడియోలో రికార్డు చేసి పోస్టు చేశారు.ఈ వీడియోలో  ఐసోలేషన్ వార్డులో తనతో పాటు మరొకరు ఉన్నారని, ఆ వ్యక్తికి రిపొర్టులో నెగిటివ్ రావడంతో, అతను ఇంటికి వెళ్లిపోయాడన్నారు. తాను మాత్రం ఒంటరిగా అక్కడ ఉన్నానన్నారు.

పేషెంట్స్ నుండి  ఏఏ శాంపిల్స్ తీసుకుంటారు, తన నుండి ఏం తీసుకున్నారు. వార్డులో ఆహారంగా ఏం పెడతారు అనే ప్రతిది తన వీడియోలో వివరించారు. అంతేకాదు విదేశాలనుండి వచ్చే ప్రతి ఒక్కరు వైధ్యులను సంప్రదించాలని, తగిన పరీక్షలు చేయించుకోవాలని ,కొద్ది రోజులు వైధ్యాధికారులతో టచ్ లో ఉండాలని కోరాడు.

watch video:

Also watch:


You may also like