అమెరికా, ఇటలీలో పరిస్థితి ఎందుకంత దారుణంగా ఉంది? ఇండియా పరిస్థితి ఏంటి?

అమెరికా, ఇటలీలో పరిస్థితి ఎందుకంత దారుణంగా ఉంది? ఇండియా పరిస్థితి ఏంటి?

by Anudeep

Ads

రోజుకు వేల సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నవారు… వందల సంఖ్యల్లో మరణాలు ..  ఇది ఇటలీ పరిస్థితి , ఇప్పుడు అమెరికా కూడా కరోనా బాదితుల సంఖ్యలో చైనాని మించి పోయింది.  అయితే కరోనా పుట్టినిల్లైన చైనాలోని ఉహాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది . మరి అమెరికా , ఇటలీల్లో ఎందుకు పరిస్థితి ఇంత భయంకరంగా మారిపోయింది, దానికి  డాక్టర్ నాగేశ్వర్ గారు చెప్పిన కారణాలు ఏంటో తెలుసా?

Video Advertisement

నిజానికి మన దేశంలో కరోనా బాదితుల సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే తక్కువే , దీనికి ఎవరెన్ని కారణాలు చెప్పినప్పటికి మనం పాటిస్తున్న లాక్ డౌన్ కూడా చాలా పెద్ద కారణం . వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ ఒక్కటే సరైన పరిష్కారం ప్రస్తుతం మన దేశంలో దాన్నే చాలా స్థిరంగా అమలుపరుస్తున్నారు.  ఇతర దేశాలు కూడా వేటికవే లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి . కాని ఇటలీ , అమెరికా దేశాల్లో పరిస్థితి చేయిదాటిపోయింది.

ఇటలీ, అమెరికాల్లో వైరస్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి కారణం, ఆయా దేశాల్లో మనకంటే ముందుగానే  వైరస్ వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ నెలాఖరున చైనాలో మొట్టమొదటి కేసు నమోదు కాగ, ఇటలీలో జనవరి నాటికి స్ప్రెడ్ అయిపోయింది. అమెరికాలో కూడా ఇంచుమించుగా అదే సమయంలో వైరస్ వ్యాప్తి ప్రారంభమయింది. అయితే వైరస్ వ్యాప్తి ప్రారంభ దశలోనే తగిన జాగ్రత్తలు తీస్కోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి ఆ రెండు దేశాలు.

ఇటలీ జనాభాలో  ఎనభైఏళ్లు పై బడిన వారి శాతం ఎక్కువ . కరోనా బారిన పడేది ఎక్కువగా వారే కాబట్టి మరణాలు ఎక్కువగా నమోదవడానికి గల కారణం కూడా అదే. అదే విధంగా ఆయా దేశాల్లో ధూమపానం అనేది చాలా ఎక్కువ, హైపర్ టెన్షన్, డయాబెటిస్ బాదితులు కూడా ఎక్కువే . వారికి వైరస్ ని తట్టుకునే శక్తి తక్కువ, చాలా ఈజీగా వైరస్ సోకి ఇన్ని మరణాలు సంబవిస్తున్నాయి.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చైనా నుండి ఇటలీకి స్ప్రెడ్ అయిన వైరస్, ఇటలీ నుండి స్పెయిన్ కి స్ప్రెడ్ అయిన వైరస్లో కొన్ని మేజర్ చేంజెస్ ఉన్నాయని, దాంతో రిస్కీ వైరస్ గా మారి పరిస్థితి మరింత డేంజరస్ గా తయారయింది.  ఈ కారణాల రీత్యా ఇటలీ, అమెరికాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అదే విధంగా మన దేశంలో వైరస్ గురించి కూడా నాగేశ్వర్ రావు గారు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు.అదేంటో  ఆయన మాటల్లోనే ఈ వీడియోలో చూడండి.

watch video:


End of Article

You may also like