కరోనా సోకినా టిక్ టాక్ వదలలేదు…చివరికి యువతి వల్ల ఐసొలేషన్ వర్డ్ లో ఆ ముగ్గురికి?

కరోనా సోకినా టిక్ టాక్ వదలలేదు…చివరికి యువతి వల్ల ఐసొలేషన్ వర్డ్ లో ఆ ముగ్గురికి?

by Anudeep

Ads

ఒకవైపు కరోనా కాటేసినా టిక్ టాక్ చేయడం మానకపోవడాన్ని ఏమంటారు…దానికి  మీరు ఏదైనా కొత్త పేరు పెట్టండి. అప్పటి వరకు పిచ్చి పీక్స్ లో ఉందనే మాట్లాడుకుందాం. మనుషుల్లోని రకరకాల వైరాగ్యాలన్నింటిని బయట పెడుతోంది కరోనా మహమ్మారి.. వీళ్ల కథలు చూడడం కంటే కరోనా వచ్చి ఐసోలేషన్లో ఉండడం బెటర్ అనిపిస్తోంది. నిజంగా ఇలాంటి వాళ్లని ఏం చేయాలసలు ..ఇంతకీ ఏం జరిగిందో చదవండి.

Video Advertisement

తమిళనాడులోని అళియాలూర్ జిల్లాకి చెందిన యువతి షాపింగ్ మాల్ లో పని చేసేది. పనిలో కొంచెం గ్యాప్ దొరకగానే టిక్ టాక్ చేసి అప్లోడ్ చేయడం అలవాటు.. ఫాలోవర్స్ సంఖ్య కూడా బాగానే ఉంది. మరింకేం ఫాలోవర్స్ పెరుగుతున్నా కొద్ది వీడియోస్ చేయాలనే ఉత్సాహం కూడా పెరుగుతుంది. అలవాటు కాస్తా వ్యసనంగా మారిందనడానికి ఇదోక మంచి ఉదాహరణ.

ఇటీవల జ్వరం, దగ్గు లక్షణాలు కనపపడడంతో హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకుంది. రిజల్ట్ పాజిటివ్..ఇంకేం అమ్మాయి గారిని పద్నాలుగు రోజులు ఐసోలేషన్లో పెట్టారు . అలవాటు పడిన చేతులు ఊరుకుంటాయా?టిక్ టాక్ చేయాలని సంబర పడింది.. చేసింది . తనతో పాటు క్వారంటైన్లో ఉన్న సిబ్బందిని కూడా వీడియోలో చూపించింది.

తనకు దగ్గుగా ఉందని, గొంతు నొప్పి ఉండడం వలన ఏం తినలేకపోతున్నా అని , అభిమానులను చాలా మిస్ అవుతున్నా అని  బాధగా చెప్పేసరికి మన గొర్రెల మంద ఫ్యాన్ ఫాలోయింగ్ అయ్యో, అబ్బా అంటూ విపరీతంగా శేర్లు కొట్టారు. దాంతో వీడియో అధికారుల వద్దకు చేరింది. క్వారంటైన్ వార్డులో తీసుకోవాలసిన జాగ్రత్తలు తీస్కోలేదని టిక్ టాక్ స్టార్ కి తిట్లు..హాస్పింటల్ సిబ్బందికి సస్పెషన్ ఆర్డర్ రెడి చేశారు అధికారులు .

శానిటైజేషన్ సిబ్బంది ముగ్గురిని సస్పెండ్ చేసి, వాళ్లని కూడా క్వారంటైన్ కి తరలించారు. కరోనా సోకకుండా సోషల్ డిస్టెన్స్ పాటించండి అని నెత్తి నోరు మొత్తుకుని చెప్తుంటే, కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ తో టిక్ టాక్లు చేస్తే కాటేయకుండా ఉండుందా?  టిక్ టాక్ వీడియో చేసిన సిబ్బంది అందరిని క్వారంటైన్ కి తరలించి టెస్టులు చేస్తున్నారు.. అదీ సంగతి..

image source: 1


End of Article

You may also like