అక్కడ ఉండే తెలుగు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇవి..వీడియో చూస్తే కన్నీళ్లొస్తాయి!

అక్కడ ఉండే తెలుగు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇవి..వీడియో చూస్తే కన్నీళ్లొస్తాయి!

by Anudeep

Ads

“దయచేసి మమ్మల్ని ఇండియాకి తీస్కెళ్లండి, మమ్మల్ని రక్షించండి , ప్లీజ్. ఇక్కడ క్షణం క్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం” అంటూ ఇటలీలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్దుల వీడియో ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తుంది. ఉన్నత చదువుల కోసం ఇక్కడికి వచ్చాం కాని బతుకుతామో లేదో అనే భయంతో గడుపుతున్నాము, దయచేసి మమ్మల్ని తీసుకెళ్లండి అంటూ వేడుకుంటున్నారు .

Video Advertisement

కరోనా ఎఫెక్ట్ తో ఇటలీలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలిసిందే. నిమిషనిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా నుండి చైనా కోలుకోగలిగింది కానీ, ఇటలీ పరిస్థితి మాత్రం చేయి దాటిపోయింది. అందరికి వైధ్య సదుపాయం అందించలేక, నిస్సహాయ స్థితిలో నిర్దాక్షిణ్యంగా ముసలివాళ్లకి వైధ్యసదుపాయలు అందించడానికి నిరాకరించింది .  అంతేకాదు ఇటలీ నుండి ఇతర దేశాలకు పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశానికి చెందిన కొంతమంది విద్యార్దులు ఇటలీలో చిక్కుకుపోయారు.

మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే ఎయిర్పోర్ట్ లోకి అనుమతినిస్తామని ఆపేశారు. మరో వైపు మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు అంటున్నారని చెప్తున్నారు స్టూడెంట్స్. ఈ నెల పదకొండవ తేదిన ఎయిరిండియా విమానంలో భారత్ కి చేరుకోవాల్సిన విద్యార్దులని, అక్కడ పరిస్తితి విషమంగా ఉండడంతో తీసుకురావడానికి నిరాకరించారు.

ఎంబసీ వారే ప్రత్యేక హోటల్ లో వారికి బస ఏర్పాటు చేసి, ఫూడ్ కల్సించి టెస్టులు చేయిస్తున్నారు. గత పదిరోజులుగా వారిది ఇదే పరిస్థితి.” ఇక్కడ అందరికి కరోనా సోకుతుంది . ప్రస్తుతం మేం బాగానే ఉన్నాము. కావాలంటే మమ్మల్ని ఇండియా తీసుకెళ్లి ఏ టెస్టులైనా చేసుకోండి కాని మమ్మల్ని మాత్రం ఇక్కడ నుండి తీస్కెళ్లిపోండి”  అంటూ కొందరు తెలుగు విద్యార్దులు వీడియోలో తమ బాధని విన్నవించుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో అందరిని కంటతడి పెట్టిస్తుంది. కుటుంబ సభ్యులకు ఏం చెప్పలేకపోతున్నాం. గవర్నమెంటే చొరవ తీసుకుని మమ్మల్ని తీసుకెళ్లాలి. ఇండియా తీసుకెళ్లి ఎన్ని నెలలైనా మమ్మల్ని ఐసోలేషన్లో పెట్టండి కాని ఇక్కడ మాత్రం వదిలేయకండి అంటూ ఏడుస్తూ విన్నవించుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తెలంగాణా మినిస్టర్ కెటిఆర్, ఎపి సిఎం జగన్ లను రిక్వెస్ట్ చేస్తున్నారు.   ఉన్నత చదువలు కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన ఎందరో భారతీయుల పరిస్థితి ఇదే,  చూడాలి మరి ఏం జరుగుతుందో.

also watch:


End of Article

You may also like