అక్కను ప్రేమించాడు…నో చెప్పిందని చెల్లిని…! వాట్సాప్ వాడుకొని ఎంత పెద్ద స్కెచ్ వేసావురా..?

అక్కను ప్రేమించాడు…నో చెప్పిందని చెల్లిని…! వాట్సాప్ వాడుకొని ఎంత పెద్ద స్కెచ్ వేసావురా..?

by Anudeep

Ads

ప్రేమని అంగీకరించకపోతే బతిమిలాడి ఒప్పించే రోజులు పోయాయి .ప్రేమ ఒప్పుకోకపోతే బెదిరించడం , భయపెట్టడం, అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకపోతే తెగించి యాసిడ్ దాడులు చేయడం , ఇది ప్రస్తుతం సమాజంలో తీరు. తనకు దక్కనిది మరొకరు దక్కకూడదనే శాడిజం చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రభుద్దుడు మరికొంచెం ముందుకెళ్లి అక్క ప్రేమించలేదని , చెల్లిని వేధించడం స్టార్ట్ చేశాడు.

Video Advertisement

నిజాంపేటకు చెందిన కోట్ల మాధవ్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు, డిగ్రీ పూర్తి చేసాడు . సిటీలోని ఓ కంపెనీలో చిన్న జాబ్ చేస్తున్నాడు. నాలుగేండ్ల క్రితం ఒక అమ్మాయితో మాధవ్ కి పరిచయం అయింది . తనతో స్నేహంగా ఉంటున్న అమ్మాయికి ప్రేమిస్తున్నా అని తన ప్రేమను బయటపెట్టాడు. నీ పట్ల నాకు అలాంటి అభిప్రాయం లేదని సూటిగా చెప్పడంతో ఇగో హర్టయి తనపై కక్ష పెంచుకున్నాడు . తనని బాధపెట్టడం కంటే తనకు ఎంతో ఇష్టమైన చెల్లెలిని ఏడిపిస్తే తన కోపం తగ్గుతుందని,  ఆ యువతి చెల్లెలి ఫోన్ నంబర్ ని సేకరించాడు.

ప్లే స్టోర్ ద్వారా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసి ,ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ కి వాట్సాప్ లింక్ చేసుకున్నాడు. ఆ నంబర్తో వాట్సాప్ లో యువతి చెల్లికి అసభ్యకర మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టాడు. కొత్త నంబర్ నుండి వస్తున్న మెసేజ్లతో విసిగిపోయిన బాధితురాలు మొదట ఏదో పొరబాటున వస్తున్నాయనుకుంది. కానీ మాధవ్ వేధింపులు ఎక్కువవడంతో  రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.

టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి మాధవ్ గా తేల్చి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వేధిస్తూకాల్స్ లేదా మెసేజ్ లు వస్తే వాటిని అవాయిడ్ చేసి పోలీసులకు కంప్లయింట్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

ఇదేం సాడిజం రా బాబూ . నిజంగా  నీలో తనకు నచ్చే లక్షణాలుంటే ఏ అమ్మాయైనా ఎందుకు యాక్సెప్ట్ చేయదు . ఇలాంటి పనుల వల్ల ఏం సాధిస్తున్నార్రా? కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి రా, ప్రేమించకపోతే మరి కొంచెం ప్రేమను పంచడానికి ట్రై చేయండి అంతేకాని మృగాళ్ల మారకండి, ఏమంటారు ఫ్రెండ్స్..


End of Article

You may also like