“కంగ్రాట్స్ మై లవ్” అంటూ ఎమోషనల్ నోట్ రాసిన అక్షయ్ కుమార్..ఏమైందంటే.?

“కంగ్రాట్స్ మై లవ్” అంటూ ఎమోషనల్ నోట్ రాసిన అక్షయ్ కుమార్..ఏమైందంటే.?

by Harika

Ads

ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్‌ ఖన్నా గురించి అందరికి తెలిసే ఉంటుంది. వెంకటేష్ శీను మూవీలో హీరోయిన్ గా చేసింది. స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ఆమె. అక్షయ్ కుమార్ సినిమాల గురించి పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు ఆమె. ప్రస్తుతం ఆమె గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే..50 ఏళ్ల వయసులో గొప్ప మైలురాయిని అందుకున్నారు. లండన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి పట్టా సాధించారు.

Video Advertisement

https://www.instagram.com/p/C2KgD2lJScL/

భార్య మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంపై అక్షయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేసారు. ఆమెను అభినందిస్తూ అక్షయ్ సోషల్ మీడియా వేదికగా ఓ స్వీట్ నోట్ రాశారు.”చదువుకోవాలనుందని రెండేళ్ల క్రితం నువ్వు నాకు చెప్పిన సమయంలో ఆశ్చర్యపోయా. ఎంతో కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్‌, నన్ను, పిల్లలను చూసుకుంటూనే డిగ్రీ పూర్తి చేశావ్. నేను సూపర్‌ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నీవు ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్‌ మై లవ్‌” అంటూ రాసారు ఆయన. ఆ నోట్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.


End of Article

You may also like