తొలిచిత్రంలో అన్నాచెల్లెల్లు… కట్ చేస్తే భార్యభర్తలు..!

తొలిచిత్రంలో అన్నాచెల్లెల్లు… కట్ చేస్తే భార్యభర్తలు..!

by Megha Varna

Ads

జయరాం సుబ్రహ్మణ్యన్.. ఈ పేరు చెప్తే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ పంచతంత్రం మూవీ యాక్టర్ జయరాం అంటేనో, అల వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్ అని చెప్తేనో ఈజీగా గుర్తు పట్టేస్తారు.. ఒక మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన జయరాం తర్వాత సినిమాల్లోకి రావడం పద్మశ్రీ అవార్డు అందుకునేంత ఎత్తుకి ఎదగడం మామూలు విషయం కాదు..

Video Advertisement

పంచతంత్రం సినిమాలో కమల్ తో పాటు నటించిన నలుగురు స్నేహాతుల్లో జయరాం ఒకరు.. అందులో ఐదుగురు కలిసి పండించిన కామెడీ అంతా ఇంతా కాదు..జన్మత: మళయాలి అయినప్పటికి కూడా మళయాలంతో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటించారు..తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో కనిపించిన జయరాం ఇప్పటివరకు సుమారు 200చిత్రాల్లో నటించారు..జయరాంతో పాటు భార్యా,పిల్లలు కూడా మనకి సుపరిచితులు కావడం విశేషం.

జయరాం భార్య పార్వతి జయరాం ఎనభై,తొంభై దశకాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.. జయరాం కంటే రెండేళ్లు ముందు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె, జయరాం తొలిచిత్రం అపరన్ లో నటించింది..ఆ చిత్రంలో జయరాం,పార్వతి జయరాం అన్నాచెల్లెల్లుగా నటించడం విశేషం.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో ఇద్దరూ హీరోహోరోయిన్లుగా నటించడం, పరిచయం ప్రేమగా,ప్రేమ పెళ్లిగా రూపుదిద్దుకుంది..

జయరాం,పార్వతి జయరాంలకు ఇద్దరు పిల్లలు కొడుకు కాళిదాస్ జయరాం,కూతురు మాళవిక జయరాం.. కాళిదాస్ చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అయి,ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు..తొలిచిత్రంతోనే నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో బెస్ట్ చైల్డ్ గా అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నాడు. మాళవిక జయరాం మోడల్ గా రానిస్తుంది..త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.


End of Article

You may also like