Ads
గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు వరద భీభత్సంతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. వరసగా వర్షాలు పడుతుండడంతో వరద తలెత్తి రాష్ట్రంలో పలు చోట్ల ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి ఇంకా సద్దుమణగనే లేదు అప్పుడే మరో ఇబ్బందికర పరిస్థితి రాబోతోంది.
Video Advertisement
తాజాగా వెదర్ మ్యాన్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే కొంతైనా అలజడి కలగక మానదు. మరో మూడు రోజుల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారొచ్చని వెదర్ మ్యాన్ చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో ఊహించని విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 27 నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అనంతపురం, గుంటూరు- కోస్తా, కృష్ణా- కోస్తా జిల్లాలో కూడా ఓ మాదిరి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కురిసిన వర్షాల వలన చెరువుల్లోనూ, వాగుల్లోనూ, బావుల్లోనూ నీరు అలానే ఉంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు ఇంకా ఇంకిపోలేదు.
ఈ క్రమంలో తిరిగి వర్షాలు పడితే.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే కనీసం పది రోజులకు సరిపడా అవసరమైన సరుకులు తెచ్చిపెట్టుకోవాలని, ముఖ్యమైన పనులు ఉంటె నవంబర్ 26 లోపు పూర్తి చేసుకోవాలని వెదర్ మ్యాన్ చెబుతున్నారు. అలాగే మీ చుట్టూ ఉండే అధికారుల నంబర్లు, వారు ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలుసుకోవాలని చెబుతున్నారు.
ఈ మూడు రోజులు మీరు చేయాల్సిన పనులు –
====
1) మీ చుట్టూ ఉండే అధికారుల నంబర్లు, వారు ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలుసుకోండి.
2) వరద తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పడవ అందుబాటులో ఉంచుకోవడం మంచిది.(1/2)
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) November 23, 2021
End of Article