Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి.
ఈ సినిమాతో అలియా భట్ కూడా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అలియా భట్ పాత్ర ఈ సినిమాలో చాలా ముఖమైన పాత్ర. సినిమాలో అలియా భట్ పాత్ర ఉన్నది కొంచెం సేపు అయినా కూడా గుర్తుండిపోతారు. కానీ అలియా భట్ బాలీవుడ్లో పెద్ద స్టార్ హీరోయిన్. చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న నటి. ఈ సినిమాలో అలియా భట్ పాత్ర కూడా ఆమె స్టార్‌డమ్‌కి తగ్గట్టుగా ఉంటుంది అని అక్కడ ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సినిమాలో అలియా భట్ కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు. అయితే అలియా భట్‌కి సంబంధంచిన విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్ట్ లను సోషల్ మీడియా నుండి తీసేసారు. అలాగే రాజమౌళిని కూడా అన్ ఫాలో చేశారు.
దాంతో ఆలియా భట్ తన పాత్ర గురించి అసంతృప్తిగా ఉన్నారు ఏమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అంతకుముందు జరిగిన ప్రమోషన్స్ లో పాల్గొన్నా కూడా ఇటీవల జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఒక్క ఢిల్లీ ఈవెంట్ లో తప్ప మిగిలిన ఏ ఈవెంట్ లో కూడా ఆలియా భట్ పాల్గొనలేదు. దాంతో నిజంగానే సినిమాలో తన పాత్ర గురించి డిసప్పాయింట్ అయ్యారేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు.
End of Article