అంత్యక్రియల దగ్గర ఫోన్ ఏంటి “అలియా” అంటూ ట్రోల్…కానీ అసలు కథ తెలుసా?

అంత్యక్రియల దగ్గర ఫోన్ ఏంటి “అలియా” అంటూ ట్రోల్…కానీ అసలు కథ తెలుసా?

by Anudeep

Ads

నిజం గడపదాటేలోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అనేది సోషల్ మీడియాకు సరిగ్గా సరిపోతుంది..ఒక ఫోటో లేదా ఒక విషయం సోషల్ మీడియాకి తెలిసిందంటే చాలు అందులో నిజం ఎంత అనేది ఆలోచించకుండా వందలు వేలల్లో శేర్లు, రకరకాల ట్రోల్స్ , మీమ్స్ వచ్చేస్తాయి.ప్రస్తుతం ఆలియాబట్ గురించి జరుగుతున్న ట్రోలింగ్ చూస్తుంటే..ఇలాంటి నెగటివ్ ట్రోల్స్ కి ఇప్పటికైనా చెక్ పెట్టి తీరకపోతే రేపటికి మనమే ఒక వైరల్ టాపిక్ అవుతామనిపిస్తోంది..Be responsible.. Be restraint..

Video Advertisement

మొన్న ఇర్పాన్ ఖాన్, నిన్న రిషికపూర్ మృతితో బాలివుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. లాక్ డౌన్ మూలంగా ఎవరూ అంత్యక్రియలకు హాజరు కాలేని పరిస్థితి..దగ్గరలో ఉన్న అతికొద్ది మంది వ్యక్తులతో అంత్యక్రియలు జరిగిపోయాయి.. అనేక మంది చివరి చూపుకు నోచుకోకుండానే ఆ లెజెండ్స్ కి వీడ్కోలు పలికారు.. అయితే రిషి కపూర్ అంత్యక్రియల సమయంలో అలియా భట్ ఫోన్ పట్టుకుని ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

నిజానికి అలీయా భట్ ఫోన్లో రిషికపూర్ కుమార్తే , రణ్ బీర్ సోదరి రిధిమా కపూర్  తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అలియా వీడియో కాల్లో రిధిమా తన తండ్రిని చివరిసారి చూసుకున్నారు, తండ్రి అంత్యక్రియలను వీడియో కాల్ లోనే చూసారు..ఈ ఫోటో సోషల్ మీడియాకు దొరకడంతో “అంత్యక్రియల్లో కూడా ఫోన్ వాడుతోందంటూ ఆలియా మీద రకరకాల ట్రోల్స్ వచ్చాయి..”సహజంగానే ఆలియా ఎప్పటికప్పుడు ట్రోలర్స్ కి చిక్కుతుంది..కాని ఇందులో ఒక విషాదం ఉంది..దాన్ని కూడా నవ్వులపాలు చేయడం, నవ్వుకోవడానికి వాడుకోవడం విషాదం..

గతంలో కూడా ఒక డెడ్ బాడీ దగ్గర కూర్చుని సెల్ ఫోన్ పట్టుకుని కూర్చున్న ఇద్దరు తల్లి కూతుర్ల గురించి ఇదే తరహాలో ట్రోల్స్ వచ్చాయి..ఆఖరికి శవంతో సెల్ఫీ దిగుతున్నారని..నిజానికి ఆ ఫోటోలో అయినా, ఆలియా ఫోటోలో అయినా వారు బాధ పడుతున్న ముఖాలు స్పష్టంగా కనపడుతున్నాయి.అయినా కూడా నవ్వుకోవడానికి మనకి ఒకరు దొరికితే చాలు అన్నట్టుగా విచ్చలవిడిగా శేర్ చేసారు.ఇలాగే చేస్తూ పోతే రేపు నువ్వు కూడా నవ్వులపాలు కాక తప్పదు..మళ్లీ చెప్తున్నా Be responsible.. Be restraint..

 


End of Article

You may also like