Ads
రణబీర్ కపూర్, ఆలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమాల్లో కలిసి నటించారు. హైదరాబాద్ లో తాజాగా ప్రెస్ మీట్ కూడా దీనికి సంబంధించి నిర్వహించారు. అయితే గెస్ట్ గా ఈ ప్రెస్ మీట్ కి రాజమౌళి వచ్చారు. ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ ఈ చిత్రం నా ఏడు ఏళ్ల కష్టమని అన్నారు.
Video Advertisement
అలానే దర్శకుడు అయాన్ కూడా ఏడేళ్ల పాటు కష్ట పడ్డారని చెప్పుకొచ్చారు ఈ భామ. ఈ సినిమా ఒక ఎమోషనల్ అంటూ కరుణ్ చెప్పింది వాస్తవమే అని ఆలియా భట్ అన్నారు. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 9న ఈ సినిమా విడుదల కానుంది.
ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ రాజమౌళి తో పాటు తారక్, రామ్, నేను అంతా కూడా ప్రేక్షకుల నుంచి అంతులేని ప్రేమాభిమానాలను సంపాదించున్నాం అని అన్నారు. అలానే ఇది ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అక్కినేని నాగార్జున గురించి ఆమె మాట్లాడుతూ నాగార్జున ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారని.. ఎక్కువగా ఆయన కోసం మేము ఎదురు చూసే వాళ్ళం అని నాగార్జున పై ప్రశంసలు కురిపించారు అలియా భట్.
End of Article