“మా నమ్మకానికి భంగం కలిగించింది..!” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్‌” సినిమాపై లేఖ..! ఏం ఉందంటే..?

“మా నమ్మకానికి భంగం కలిగించింది..!” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్‌” సినిమాపై లేఖ..! ఏం ఉందంటే..?

by kavitha

Ads

ప్రభాస్‌ రాముడిగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’ సినిమాకు రిలీజ్ అయిన దగ్గర నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్ర బృందం డైలాగ్స్ ను మారుస్తామని ప్రకటించింది. అయినప్పటికి ఈ మూవీ పై వస్తున్న ట్రోల్స్ ఆగడం లేదు.

Video Advertisement

టాక్ తో, విమర్శలతో సంబంధం లేకుండా ఈ చిత్రం మూడు రోజులలో 340 కోట్లను వసూల్ చేసింది. అయితే సోమవారం నాడు ఈ మూవీ వసూళ్లు భారీగా తగ్గాయి. తరువాత రోజుల్లో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ సమయంలో ఆదిపురుష్‌ చిత్ర బృందానికి మరో ఎదురుదెబ్బ తగలబోతుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
adipurush banఆదిపురుష్ సినిమాను దేశవ్యాప్తంగా బ్యాన్‌ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ పీఎం మోదీకి లేఖ రాశారు. అందులో ఈ సినిమా ప్రదర్శనను థియేటర్లు మరియు ఓటీటీలో బ్యాన్ చేసేట్టు ఆదేశించాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ మోదీని అభ్యర్థించింది. ఆదిపురుష్ మూవీ దర్శకుడు ఓం రౌత్, రైటర్ మనోజ్ శుక్లా పై వెంటనే పై కేసు నమోదు చేయాలని కోరింది.
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాముడు, హనుమంతుడి గౌరవాన్ని పోగొట్టేలా ఉన్నాయని పేర్కొంది. శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడి క్యారెక్టర్లను మలిచిన విధానం బాగాలేదని పేర్కొన్నారు. భారతీయ ఇతిహాసమైన రామాయణం పేరుని చెడగొట్టేలా ఆదిపురుష్‌ ఉందని, మూవీలోని డైలాగ్‌లు హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అన్నారు. భారతదేశంలో శ్రీరాముడిని దేవుడిలా ఆరాధిస్తారని, కానీ ఆదిపురుష్ మూవీలో రాముడిని, రావణాసురుడిని వీడియో గేమ్స్లోని క్యారెక్టర్లలా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇలాంటి మూవీలో హీరో ప్రభాస్‌, హీరోయిన్ కృతి సనన్, సైఫ్‌ అలీఖాన్‌ లు భాగస్వామ్యం అవడం సిగ్గుచేటని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొన్నారు.

Also Read: “రావణాసురుడు అలాంటివాడు కాదు కదా..? ఆయనతో ఇలాంటి పని ఎలా చేయించారు..?” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like