AA OKKATI ADAKKU REVIEW : “అల్లరి నరేష్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

AA OKKATI ADAKKU REVIEW : “అల్లరి నరేష్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

అల్లరి నరేష్ అంటే కామెడీ. తన కామెడీ టైమింగ్ తో ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లరి నరేష్. అల్లరి నరేష్ కామెడీ మాత్రమే కాదు, అన్ని రకాల నటన చాలా బాగా చేయగలరు. అందుకే ఇటీవల కొన్ని సీరియస్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ తన కామెడీ టైమింగ్ తో నవ్వించడానికి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : ఆ ఒక్కటి అడక్కు
  • నటీనటులు : అల్లరి నరేష్, ఫారియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జెమీ లివర్.
  • నిర్మాత : రాజీవ్ చిలక
  • దర్శకత్వం : మల్లి అంకం
  • సంగీతం : గోపీ సుందర్
  • విడుదల తేదీ : మే 3, 2024

aa okkati adakku movie review

స్టోరీ :

గణ అలియాస్ గణపతి (అల్లరి నరేష్) ఒక సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. తన తమ్ముడు (రవికృష్ణ)కి వాళ్ళ మేనమామ కూతురు అయిన దేవి (జెమీ లివర్)తో పెళ్లి చేస్తాడు. అలా గణపతి తమ్ముడికి గణపతి కంటే ముందే పెళ్లి జరుగుతుంది. గణపతి వయసు పెరిగిపోతూ ఉంటుంది. దాంతో 50 సంబంధాలు చూసినా కూడా పెళ్లి జరగదు. మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి (ఫారియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. గణపతి సిద్ధితో ప్రేమలో పడతాడు.

aa okkati adakku movie review

కానీ సిద్ధి గణపతికి తాను కరెక్ట్ కాదు అని చెప్పి రిజెక్ట్ చేస్తుంది. అయినా కూడా సిద్ధి, గణపతి స్నేహితులుగా ఉంటారు. ఆ తర్వాత సిద్ధి గురించి ఒక నిజం బయటికి వస్తుంది. అసలు సిద్ధి ఎవరు? తను అలా ఎందుకు చేసింది? నిజంగానే సిద్ధి డబ్బులు దోచుకునే పనులు చేసిందా? గణపతి ఈ విషయాలన్నీ ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

aa okkati adakku movie review

రివ్యూ :

సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. సినిమా మొత్తం కూడా అలాగే సాగుతుంది. చాలా కాలం క్రితం రాజేంద్రప్రసాద్ గారు హీరోగా, ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తీసుకొని ఈ సినిమా తీశారు. కామెడీ పేరుతోనే ఈ సినిమాలో ఒక మెసేజ్ కూడా చెప్పడానికి ప్రయత్నించారు. సినిమా ట్రైలర్ చూసి సినిమా అంతా కామెడీగా ఉంటుంది అనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. సినిమాలో ఒక సీరియస్ విషయం మీద కూడా డీల్ చేశారు.

aa okkati adakku movie review

పెళ్ళికాని వారి కష్టాలు ఎలా ఉంటాయి? ఆ కష్టాలని ఈ మ్యాట్రిమోనీ వాళ్లు ఎలా అడ్వాంటేజ్ గా తీసుకుంటారు అనే విషయాలని ఇందులో చూపించారు. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమా సీరియస్ విషయం మీద నడుస్తుంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా నటించారు. అల్లరి నరేష్ ని చాలా సంవత్సరాల తర్వాత ఒక కామెడీ పాత్రలో చూడడం బాగా అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టు నటించారు. టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది. గోపీ సుందర్ అందించిన పాటలు వినడానికి, చూడడానికి బాగున్నాయి. పెళ్లికూతురు పేరుతో ఒక అమ్మాయి చేసే పనులని ఈ సినిమాలు చూపించాలి అని ప్రయత్నించారు.

aa okkati adakku movie review

ఇంత సీరియస్ విషయాన్ని తీసుకున్నప్పుడు ఇంకా టేకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. అట్ టోటల్ కామెడీ వైపు కూడా సినిమా వెళ్లలేదు, ఇటు టోటల్ సీరియస్ విషయం మీద కూడా సినిమా నడవలేదు. రెండిట్లో ఏదో ఒక విషయం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేది. ఇలాంటి కాన్సెప్ట్ మీద సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. అందుకే సీరియస్ గా డైవర్ట్ అవ్వకుండా ఆ ఒక్క విషయం మీద సినిమా నడిచినా కూడా బాగుండేది అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • దర్శకుడు ఎంచుకున్న పాయింట్
  • కొన్ని కామెడీ సీన్స్
  • పాటలు
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • సబ్జెక్ట్ ని డీల్ చేసిన విధానం
  • కొన్ని చోట్ల సాగదీసినట్టుగా ఉండే స్క్రీన్ ప్లే

రేటింగ్ :

2.75/5

ట్యాగ్ లైన్ :

ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సినిమా మొత్తం కామెడీ మీద వెళుతుంది అని అనుకోకుండా, అసలు అలాంటి ఒక సీరియస్ విషయాన్ని ఎలా డీల్ చేశారు అని చూడాలి అనుకుంటే, అల్లరి నరేష్ ని ఇలాంటి పాత్రలో చూడడం చాలా రోజులు అయ్యింది కాబట్టి అల్లరి నరేష్ కోసం సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : BAAK MOVIE REVIEW : తమన్నా, రాశి ఖన్నా, ముఖ్య పాత్రల్లో నటించిన ఈ హారర్ సినిమా భయపెట్టిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like