BAAK MOVIE REVIEW : తమన్నా, రాశి ఖన్నా, ముఖ్య పాత్రల్లో నటించిన ఈ హారర్ సినిమా భయపెట్టిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

BAAK MOVIE REVIEW : తమన్నా, రాశి ఖన్నా, ముఖ్య పాత్రల్లో నటించిన ఈ హారర్ సినిమా భయపెట్టిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

చంద్రకళ సినిమా తర్వాత అదే ఫార్ములాతో వచ్చిన సిరీస్ ఎంత ఫేమస్ అయ్యాయో తెలిసింది. ఈ సినిమా పేర్లు తెలుగులో వేరే వేరేగా ఉంటాయి. కానీ తమిళ్ లో మాత్రం అరణ్మనై పేరుతోనే విడుదల అవుతాయి. ఇదే పేరుతో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు బాక్ పేరుతో నాలుగవ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 • చిత్రం : బాక్-అరణ్మనై 4
 • నటీనటులు : సుందర్ సి, తమన్నా, రాశి ఖన్నా, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్.
 • నిర్మాత : అవని సినిమాక్స్, బెంజ్ మీడియా (ప్రైవేట్) లిమిటెడ్
 • దర్శకత్వం : సుందర్ సి
 • సంగీతం : హిప్ హాప్ తమిళ
 • విడుదల తేదీ : మే 3, 2024

baak aranmanai 4 movie review

స్టోరీ :

సెల్వి (తమన్నా) ఇంట్లో నుండి పారిపోయి, తను ప్రేమించిన వ్యక్తి (సంతోష్ ప్రతాప్) ని పెళ్లి చేసుకుంటుంది. అడవిలో ఉండే ఒక ఇంట్లో, ఇద్దరు పిల్లలు, భర్తతో సంతోషంగా ఉంటుంది. ఒకరోజు సెల్వి అన్న శరవణన్ (సుందర్ సి) కి సెల్వి చనిపోయినట్టు, తన ప్రాణాలని తనే తీసుకున్నట్టు వార్త వస్తుంది. తన భర్త చనిపోయాడు అని తెలియడంతో సెల్వి ఇలాంటి పని చేసింది అని వాళ్ళకి అర్థం అవుతుంది. దాంతో శరవణన్, తన బంధువు (కోవై సరళ) తో కలిసి సెల్వి ఉండే ఊరికి వెళ్తాడు.

baak aranmanai 4 movie review

అక్కడికి వెళ్లిన తర్వాత, సెల్వి చనిపోవడానికి కారణం ఇంకా ఏదో ఉంది అని అర్థం అవుతుంది. అక్కడే ఉండే లోకల్ డాక్టర్ మాయ (రాశి ఖన్నా) సహాయంతో శరవణన్ అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సెల్వి ఎందుకు చనిపోయింది? తన పిల్లలు ఏమయ్యారు? శరవణన్ అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కనిపెట్టగలిగాడా? వాళ్లు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

baak aranmanai 4 movie review

రివ్యూ :

చంద్రకళ వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆ తర్వాత అదే ఫార్మేట్ లో చాలా సినిమాలు వచ్చాయి. దాంతో ప్రేక్షకులకి ఇలాంటి సినిమాలు కొత్తగా అనిపించట్లేదు. అందులోనూ ముఖ్యంగా హారర్ కామెడీ సినిమాలు అయితే బోర్ కొట్టేసాయి. ఈ సినిమా కూడా చంద్రకళ, కళావతి, ఆ తర్వాత వచ్చిన అంతపురం సినిమా లాగా సాగుతుంది. ఈ మూడు సినిమాలని తెలుగులో వేరు వేరు పేర్లతో విడుదల చేసినా కూడా తమిళ్ లో అరణ్మనై 1, అరణ్మనై 2, అరణ్మనై 3 సినిమాల పేరుతోనే విడుదల చేశారు.

baak aranmanai 4 movie review

ఇప్పుడు అరణ్మనై 4 భాగాన్ని తెలుగులో బాక్ పేరుతో విడుదల చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండేలాగా చూసుకున్నారు. ఈ సినిమాలో ఒక కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేయడానికి ప్రయత్నించారు. బాక్ అంటే ఏంటి అనేదాన్ని ఈ సినిమాలో చూపించాలి అనుకున్నారు. కానీ మధ్యలో మళ్ళీ కమర్షియల్ టెంప్లెట్ కి షిఫ్ట్ అయిపోతుంది. చాలా మంది కామెడియన్స్ వస్తూ ఉంటారు. హారర్ సినిమాలో అసలు కమెడియన్స్ అవసరం ఏంటి అని ఒక సమయంలో అనిపిస్తుంది. బాక్ అనే కాన్సెప్ట్ మీద సినిమా సీరియస్ గా తీసి ఉంటే ఇంకా బాగా అనిపించేది.

baak aranmanai 4 movie review

ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, తమన్నాకి ఈ సినిమాలో నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. తమన్నా బాగా నటించారు. రాశి ఖన్నా తన పాత్ర పరిధి మేరకు నటించారు. పాటలు కూడా సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే, సినిమాలో కామెడీ మాత్రం అనవసరంగా పెట్టారు అనిపిస్తుంది. ముందు మూడు భాగాలతో పోలిస్తే ఈ సినిమాలో కాన్సెప్ట్ చాలా బలంగా ఉంటుంది. కానీ దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తే సినిమా ఇంకా ఆసక్తికరంగా సాగేది. లాజిక్స్ కూడా చాలా చోట్ల మిస్ అయినట్టు అనిపిస్తాయి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

 • నటీనటులు
 • నిర్మాణ విలువలు
 • ఎంచుకున్న కాన్సెప్ట్
 • థ్రిల్లింగ్ గా అనిపించే కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్:

 • కమర్షియల్ అంశాలని యాడ్ చేయడం
 • అనవసరమైన కామెడీ

రేటింగ్ : 

2.5/5

ట్యాగ్ లైన్ :

ముందు మూడు సినిమాలతో పోలిస్తే ఇది బాగున్నా కూడా కాన్సెప్ట్ పరంగా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా ఆసక్తికరంగా అనిపించేది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అసలు బాక్ గురించి ఈ సినిమాలో ఏం చూపించారు అని తెలుసుకోవాలి అనుకుంటే బాక్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : శివాజీలో నటించిన ఈ ఇద్దరు రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారో చూస్తే ఆశ్చర్యపోతారు.!


End of Article

You may also like