Ads
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మంత్రి ఎర్రబెల్లిని కలవడం అందరిలో కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా లో ఎర్రబెల్లి తో పాటు అల్లు అరవింద్ దిగిన ఫోటో వైరల్ అవుతోంది. వీరిద్దరూ ఎందుకు కలిశారు అన్న చర్చ మొదలవుతోంది. ఇటీవల కాలం లో సినిమా ప్రముఖులు రాజకీయ నాయకులతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.
Video Advertisement
ఈ నేపధ్యం లో మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లిని అల్లు అరవింద్ కలవడం చర్చనీయాంశమైంది. ఈరోజు వీరిద్దరూ మర్యాద పూర్వకం గానే భేటీ అయినట్లు తెలిపారు. ఈ ఏడేళ్ల కాలం లో తెలంగాణా లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని.. సినిమా పరిశ్రమ కు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అల్లు అరవింద్ తో మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు తెలిపారు.
End of Article