Ads
డిసెంబర్ 17న పుష్ప సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ తాజాగా జర్నలిస్టులతో మాట్లాడారు. పుష్ప సినిమా గురించి పర్సనల్ గా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని చెప్పారు. తన సొంత సినిమా గురించి ఫీడ్ బ్యాక్ ని తీసుకోవాలని అనుకుంటున్నానని.. ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ గా వీడియో ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఫీడ్ బ్యాక్ ని ఇవ్వాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోరారు.
Video Advertisement
నిజంగా సినిమా ఎలా ఉంది అనేది తెలుసుకోవాలని నాకు ఉంది అని అన్నారు బన్నీ. అలానే విమర్శలు వచ్చినా ప్రశంసలు వచ్చినా పాజిటివ్ గా తీసుకుంటానని చెప్పారు.
17న పుష్ప విడుదల అవుతుంది కనుక ఆ రోజు సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా సినిమా ఎలా ఉంది అనేది తనకి తెలియజేయాలని అన్నారు. అదే విధంగా పుష్ప సినిమా గురించి చాలా కష్టపడ్డానని బన్నీ చెప్పారు. పైగా అడవి ప్రాంతాల్లో షూటింగ్ జరిగే సమయంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నానని జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు చెప్పారు బన్నీ.
End of Article