“పుష్ప” పార్ట్-2 నుంచి లీక్ అయిన ట్విస్ట్..! “అల్లు అర్జున్” ఆ పాత్రలో కూడా కనిపించబోతున్నారా..?

“పుష్ప” పార్ట్-2 నుంచి లీక్ అయిన ట్విస్ట్..! “అల్లు అర్జున్” ఆ పాత్రలో కూడా కనిపించబోతున్నారా..?

by Mohana Priya

Ads

ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్‌లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వచ్చింది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వచ్చింది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగిడారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

reasons behind pushpa negative talk

ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటంటే పుష్ప సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ 50 సంవత్సరాలు పైబడిన ఒక వ్యక్తిగా కనిపించబోతున్నారు అని సమాచారం. అలాగే ఇప్పుడు పుష్పకి, శ్రీవల్లికి ఒక కొడుకు పుడతాడు అని, ఆ కొడుకు పాత్ర కూడా అల్లు అర్జున్ పోషిస్తారు అని సమాచారం. మరొక వార్త ఏంటంటే పుష్ప కొడుకు పాత్రలో ఒక ప్రముఖ హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నాయట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే ఇంకా కొంత సమయం ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే సినిమా బృందం సినిమా కథకి సంబంధించిన చర్చల్లో ఉన్నారు.


End of Article

You may also like