అయ్యో బన్నీ ఈ టైమ్ లో ఈ ట్వీట్ వేసావ్ ఏంటి.? పాపం మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారుగా.?

అయ్యో బన్నీ ఈ టైమ్ లో ఈ ట్వీట్ వేసావ్ ఏంటి.? పాపం మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారుగా.?

by Mohana Priya

Ads

డైలాగ్ రైటర్ గా, డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలు మిక్స్ట్ టాక్ తోనే మొదలవుతాయి. నిన్న విడుదల అయిన గుంటూరు కారం సినిమాకి కూడా ఇలాగే అవుతోంది.

Video Advertisement

సినిమా కొంత మందికి నచ్చితే, కొంత మంది మాత్రం రొటీన్ అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ చేసిన ఒక పని చర్చలకి దారితీసింది. దాని వల్ల చాలా మంది మహేష్ బాబు అభిమానులు కూడా హర్ట్ అయ్యారు అని కామెంట్స్ వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా విడుదల అయ్యి 4 సంవత్సరాలు అయ్యింది. 2020 లో అల వైకుంఠపురంలో, మళ్లీ ఇప్పుడు 2024 లో గుంటూరు కారం సినిమాలు ఒకటే రోజు విడుదల అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఇలాంటి టాక్ వస్తున్న సమయంలో అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమాకి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ట్వీట్ వేశారు.

“సినిమా వచ్చి 4 ఏళ్ళు అయ్యింది. దాని జ్ఞాపకాలు మాత్రం గుండెల్లోనే ఉన్నాయి. ఇంత మంచి జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు చాలా థాంక్యూ. గ్రాటిట్యూడ్” అంటూ ఒక ట్వీట్ చేశారు అల్లు అర్జున్. దాంతో, “ఒక పక్క ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉన్న సమయంలో, తన సినిమాకి సంబంధించి ఇప్పుడు ట్వీట్ చేయడం అవసరమా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం, “తన సినిమా గురించి తాను సోషల్ మీడియాలో ట్వీట్ చేసుకుంటే అది వ్యక్తిగతంగా తీసుకొని బాధపడాల్సిన అవసరం ఏంటి?” అని అంటున్నారు.

guntur kaaram movie review

ఏదేమైనా సరే అల్లు అర్జున్ టైమింగ్ కొంచెం తప్పు అని అంటున్నారు. ఇంక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 పనిలో బిజీగా ఉన్నారు. గుంటూరు కారం సినిమా ఏమో త్రివిక్రమ్ పాత సినిమాలు అన్నీ కలిపి తీసినట్టు ఉంది అని అంటున్నారు. అంతే కాకుండా తమన్ సంగీతం మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి సినిమా వసూళ్ల పరంగా ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.


End of Article

You may also like