Ads
సాధారణం గా ఏ ప్రోడక్ట్ లేదా కంపెనీ బ్రాండింగ్ గురించి చెప్పుకోవడానికి, వినియోగదారులకు వివరించే ప్రయత్నం చేయడానికి యాడ్ లను రూపొందిస్తుంటారు. యాడ్ లను జనం లో బాగా ప్రాచుర్యం పొందేలా చేయడానికి బాగా క్రియేటివిటీ ని జోడిస్తుంటారు.
Video Advertisement
కొన్ని యాడ్ లు మనలని ఎమోషనల్ గా హత్తుకుని, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంటాయి. మరికొన్ని యాడ్ లు విమర్శల పాలు అవుతూ ఉంటాయి. అయితే ఇది జనాలకి కొత్తేమి కాదు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన యాడ్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్య అల్లు అర్జున్ చేసిన అడ్వర్టైజ్మెంట్లు వివాదంలో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్య చేసిన రాపిడో యాడ్ కూడా ఇలానే వివాదంలో చిక్కుకుంది. తాజాగా, జొమాటో యాడ్ కూడా విమర్శలు ఎదుర్కుంటోంది. అయితే.. ఈ వివాదాల గురించి పక్కన పెడితే.. ఈ యాడ్ గురించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
ఈ అడ్వర్టైజ్మెంట్ ని కూడా కాపీ చేశారా..? అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ ట్రెండింగ్ నిలుస్తున్నాయి. ఈ యాడ్ లో సీన్స్ ని గమనిస్తే.. బన్నీ , సుబ్బరాజుతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే సుబ్బరాజు స్లో మోషన్ లో కింద పడుతూ ఉంటారు. తొందరగా కిందకి దించాలని కోరుతూ ఉంటాడు. అయితే.. బన్నీ మాత్రం సౌత్ ఇండియన్ సినిమా కదా.. అందుకే స్లో మోషన్ లో ఎగరాలి అని చెబుతాడు. బన్నీ ఇలా చెప్పడం వల్లే ఈ యాడ్ వివాదానికి గురి అయింది.
అయితే.. ఈ సీన్ ని, బన్నీ-సుబ్బరాజుల కాంబోని గమనిస్తే మనకి మరో సౌత్ ఇండియన్ మూవీ గుర్తొస్తుంది. బన్నీ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాధం సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా చివరిలో బన్నీ-సుబ్బరాజులది ఎయిర్పోర్ట్ సీన్ ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ ను చూస్తుంటే ఆ సీన్ గుర్తొస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీకు కూడా అలానే అనిపించిందా..?
End of Article