Ads
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. సమావేశాల ప్రారంభం ముందు మంత్రి అంబటి రాంబాబు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఒక్క హామీని అమలు చేయలేదని, సీఎం జగన్ ఇచ్చిన హామీలన్ని అమలు చేశారని అన్నారు.
Video Advertisement
టీడీపీ జనసేనకు ఎక్కువ సీట్లును కేటాయించదని, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని అన్నారు. ”సీట్ల ముష్టి కోసం పవన్ కళ్యాణ్ 2 సార్లు చంద్రబాబు వద్దకు వెళ్లాడు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడిగారి మాట విని,పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ముంచే పరిస్థితిలో ఉన్నాడు.
60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారనే భ్రమల్లో ఉండవద్దని ఏ ఇరవై ఐదు సీట్లో ముష్టి వేస్తాడు” అని అన్నారు. జనసేన, టీడీపీ ఎలెక్షన్స్ కు సిద్ధంగా లేవని, సీట్ల లెక్కల్లో ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో వైఎస్ జగన్ నిలిచిపోతారని వెల్లడించారు. ఎవరెన్ని చీలికలు చేసినా, పద్మ వ్యూహాలు పన్నినా వాటిని ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని అన్నారు.
అన్యాయాలు, అక్రమాలు చేసిన బాలశౌరి బఫూన్ బాలశౌరి బఫూన్ అని విమర్శించారు. టికెట్ రాకపోవడంతో పార్టీ మారుతున్నాడని అన్నారు. ఇది ఇలా ఉంటే ఆదివారం నాడు జరిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల భేటీ పై కూడా మినిస్టర్ అంబటి రాంబాబు స్పందించారు. ‘‘మోయటానికి ఎందుకులే భేటీలు..!’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ఒక కార్టూన్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబులను తన భుజాల పై మోస్తున్నట్టుగా ఆ కార్టూన్ ఉంది. ఆ తరువాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, వీరిద్దరూ భేటీ అవడం కొత్త విషయం కాదన్నారు. సీట్ల కోసం లేదా నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లిద్దరే చెప్పాలని కామెంట్స్ చేశారు. రెండేళ్లుగా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నా, ఇప్పటికీ సీట్ల విషయం తేల్చుకోలేకపోయారని విమర్శించారు.
Also Read: కేంద్ర బడ్జెట్ ప్రకటన…. మధ్యతరగతి వారికి ఊరట…!
End of Article