అమావాస్యకి మంగళసూత్రంకి పసుపుకొమ్మ…మరి పౌర్ణమికి మొలతాడుకి గుమ్మడికాయా?

అమావాస్యకి మంగళసూత్రంకి పసుపుకొమ్మ…మరి పౌర్ణమికి మొలతాడుకి గుమ్మడికాయా?

by Anudeep

Ads

మొన్నటికి మొన్న ఒక్క కొడుకు ఉన్న వాళ్లందరూ వేప చెట్టుకి నీళ్లు పోయాలి అని ఎవరో ఒక మెసేజ్ స్ప్రెడ్ చేశారు.అంతే మనోళ్లందరూ పోలో మంటూ గుంపులు గుంపులుగా వెళ్లి బిందెలతో నీళ్లు పట్టుకుని  వేపచెట్టుకి నీళ్లు పోసారు.ఇప్పుడు అమావాస్య రోజు ముత్తైదువలందరూ మంగళ సూత్రానికి పసుపు కొమ్ము కట్టుకోవాంటూ మరో మెసేజ్ వాట్సప్లో చక్కర్లు కొడుతుంది..అది చినజీయర్ స్వామి చెప్పారని కొందరు, సింహాచలం దేవాస్థానం వారు చెప్పారని మరికొందరు ఆ మెసేజ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు.

Video Advertisement

ఒకవైపు కరోనా అంతం కావాలంటే సామాజిక దూరం,వ్యక్తి గత శుభ్రత మాత్రమే మార్గాలని నెత్తినోరు కొట్టుకుని చెప్తుంటే చెట్లకు నీళ్లు పోయాలి, ముత్తైదువలు పసుపు కొమ్ముకట్టుకోవాలంటూ ప్రచారం చేయడంలో, వాటిని ఆచరించడం ఎంతవరకు సమంజసం. అయినా చినజీయర్ స్వామి పేరుతో ప్రచారం జరుగుతున్న దాంట్లో వాస్తవం లేదని, అది ఫేక్ అని కొట్టిపారేశారు అహోబిళ స్వామి…ఇక సింహాచలం దేవస్థానం వారు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు.

 

సరే చెట్లకి నీళ్లు పోసారు కదా అని సరిపెట్టుకుందామంటే ఆ గుంపులు గుంపులుగా వెళ్లడం ఏదైతే ఉందో.. కరోనా పోవడం మానేసి ఎంచక్కా మన దగ్గరే తిష్ట వేసేలా చేశారు. ఇప్పుడు పసుపు కొమ్ము గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది..ఇప్పటికే కొందరు పసుపు కొమ్ము కట్టుకొంటే మరికొందరు ఎందుకు కట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. అయినా ఎప్పుడూ కూడా ఆడవాళ్లే అన్ని రూల్స్ పాటించాలా? మగవాళ్లకి పాటించడానికి ఏ రూల్స్ ఉండవా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

భార్య, భర్త, అన్నా చెల్లి, అక్కా తమ్ముడు అని లేకుండా అసలు మనిషి అస్తిత్వమే ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతుంది .ఇక్కడ మాస్కు కట్టుకున్నా కూడా కష్టంగా ఉంది రా నాయనా అంటే పసుపు కొమ్ములు కట్టుకోవడం అనేది ఎక్కడుంటుంది. ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు వాటిని మరింత ముందుకు తీసుకువెళ్లడం ద్వారా ఆయా మతాలపై, సంప్రదాయాలపై చిన్నచూపు ఏర్పడుతుంది తప్ప మరోకటి కాదు. ఇలాంటి సంక్షోభాల సమయంలో ఇలాంటి వాటివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు.

ఒక చిన్న డౌటు  ఈ రోజు ఒకడు ముత్తైదువలు పసుపు కొమ్ము కట్టుకోవాలని మెసేజ్ చేయగానే కట్టుకుంటున్నారు.. రేపు ఇంకొకడు మొలతాడున్న మగవాళ్లందరిని తమ మొలతాళ్లకు గుమ్మడికాయలు కట్టుకోవాలంటే కట్టుకుంటారా??


End of Article

You may also like