Ads
ప్రస్తుతం సినిమాలకు కొదవ లేదు. సినిమాలు చూసే దారులకి కూడా కొదవ లేదు. అంతకుముందు సినిమాలు అంటే థియేటర్, లేకపోతే టీవీలో టెలికాస్ట్ మాత్రమే. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాయి. అందులో ఎన్నో భాషల సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి స్ట్రీమ్ అవుతున్నాయి.
Video Advertisement
ఈ క్రమంలో ఇటీవల ఒక సినిమా విడుదల అయ్యింది. ఇది గత సంవత్సరం వచ్చిన ఒక తెలుగు సినిమా. ఈ సినిమా పేరు విధి. కథ విషయానికి వస్తే సూర్య (రోహిత్ నందా) అనే ఒక అబ్బాయి ఉద్యోగం కోసం ఊరి నుండి సిటీకి వస్తాడు.
అక్కడ సూర్య ఒక రోజు ఒక పెన్ చూస్తాడు. దాన్ని ధర 40000 అని తెలుసుకుంటాడు. అయితే తర్వాత సూర్యకి అలాంటి పెన్ ఒకటి దొరుకుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఆ పెన్ తో ఎవరు రాస్తే వాళ్ళు చనిపోతూ ఉంటారు. దీని వల్ల సూర్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది కథ. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. రోహిత్ నందా, ఆనంది జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ రంగనాథన్ రచన అందించగా, శ్రీనాథ్ రంగనాథన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఎస్. రంజిత్ ఈ సినిమాని నిర్మించారు. గత సంవత్సరం నవంబర్ 3 తేదీన విడుదల అయిన ఈ సినిమా రిపబ్లిక్ డే రోజు ఓటీటీలోకి వచ్చింది.
ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఈ సినిమాని ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో రూపొందించారు. అంటే, ఈ సినిమాని కంటి చూపు లేని వారు కూడా అనుభూతి చెందగలరు. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి జోనర్ ఉన్న సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాని కూడా తప్పకుండా ఇష్టపడతారు.
watch trailer:
ALSO READ : కాంట్రవర్సీలకి దూరంగా ఉండే హీరో… కానీ “వెంకటేష్” పై నమోదైన కేసు ఏంటి.? అసలేమైంది.?
End of Article