మెగా ప్రిన్సెస్‌ కు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన గిఫ్ట్‌..! ఏమిటో తెలుసా..?

మెగా ప్రిన్సెస్‌ కు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన గిఫ్ట్‌..! ఏమిటో తెలుసా..?

by kavitha

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు దాదాపు 11 సంవత్సరాల తరువాత తల్లిదండ్రులుగా మారిన  విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలికి మంగళవారం అంటే చాలా సెంటిమెంట్‌. మంగళవారం రోజే ఫ్యామిలిలో మెగా ప్రిన్సెస్‌ జన్మించడంతో మెగాకుటుంబంతో పాటుగా, అభిమానులు సంతోషంతో సెలబ్రేట్  చేసుకున్నారు.

Video Advertisement

ఉపాసన డెలివరికీ హాస్పటల్ లో అడ్మిట్ అయినప్పటి నుండి బయటికి వచ్చేవరకు నేషనల్ వైడ్ గా మీడియాలో, సోషల్ మీడియాలో మొత్తం ఈ వార్తల గురించి వినిపించింది. నేడు (జూన్  30) మెగా ప్రిన్సెస్‌ బార‌సాల జరుగుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, ఉపాసన పాప కోసం వ్యాపార‌వేత్త ముఖేష్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ ను పంపించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ గిఫ్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..సాక్షి కథనం ప్రకారం, రామ్ చరణ్, ఉపాసన పాప మంగళవారం నాడు జన్మించడంతో లక్ష్మీ దేవి పుట్టిందని అందరు సంతోషంగా ఉన్నారు.  పాప రాకతో మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. పాప జాతకం చాలా బాగుందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలో కొందరు జ్యోతిష్యులు సైతం పాప జాతకం అద్భుతంగా ఉందని వెల్లడించారు.ఈరోజు మెగా ప్రిన్సెస్‌కు నామకరణం చేయబోతున్నట్లు ఉపాసన వెల్లడించారు. నేడు మెగా ప్రిన్సెస్‌ బారసాల వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ పాల్గొననున్నారు. సన్నిహితులు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. బారసాల వేడుక సందర్భంగా రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ రామ్‌ చరణ్‌- ఉపాసన జంటకు ఒక ఖరీదైన బహుమతి పంపించారట.ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖేష్ అంబానీ పంపిన ఆ బహుమతి ఏమిటంటే బంగారు ఊయల. దాని కోసం కోటి రూపాయలకు కన్నా ఎక్కువే ఖర్చు అయ్యిందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఎవరు అఫిషియల్ గా  ప్రకటన చేయలేదు.

Also Read: తెలుగు సినిమా మీద మలయాళం వాళ్ల సెటైర్..! ఈ సీన్ చూశారా..?


End of Article

You may also like