నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ NMACC లాంచ్ ఈవెంట్.. సెలబ్రిటీలకు వెండి పళ్లెంలో ఫుడ్..

నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ NMACC లాంచ్ ఈవెంట్.. సెలబ్రిటీలకు వెండి పళ్లెంలో ఫుడ్..

by kavitha

Ads

ఇటీవల నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) లాంచింగ్ వేడుక ముంబైలో గ్రాండ్ గా జరిగింది. NMACC నీతా అంబానీ కలలప్రాజెక్టు. ఇండియన్ సంసృతి మరియు అంతరించిపోతున్నటు వంటి కళలను ప్రోత్సహించాలని ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ సెంటర్ ని ప్రారంభించింది. NMACC ముంబై సిటీలోని జియో వరల్డ్ సెంటర్ లో ఉంది.

Video Advertisement

జియో వరల్డ్ సెంటర్ భవనంలో దీని కోసం నాలుగంతస్థులు కేటాయించారు. వీటిలో ఒకటి మ్యూజియంగా మార్చారు.  రెండువేల మంది కూర్చునే థియేటర్ మరియు ఆర్ట్ అండ్ ఎగ్జిబిషన్‌ కోసం గదులు, స్టూడియో అనేక విశేషాలను కలిగి ఉంది. ఈ ఓపెనింగ్ కి అంబానీ కటుంబంతో పాటుగా బాలీవుడ్ మరియు దక్షిణాదికి చెందిన సినీ సెలెబ్రెటీస్, క్రీడా, కళాకారులు, రాజకీయ, బిజినెస్ కి చెందిన సెలెబ్రెటీస్ హాజరు అయ్యారు.NMACC-Gala-foodసూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ కుటుంబం, వరుణ్ ధావన్,సిద్దార్థ్ – కియారా, జాన్వీ కపూర్, దీపికా- రణవీర్, అలియాభట్ కుటుంబం, ప్రియాంక చోప్రా కుటుంబం, అమీర్ ఖాన్, సౌందర్య రజినీకాంత్, సద్గురు, రష్మిక, సచిన్ కుటుంబం, విద్యాబాలన్, హాలీవుడ్ హీరో టామ్ హాలండ్, మరికొందరు హాలీవుడ్ ప్రముఖులు. ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు హాజరైన పలువురు సెలెబ్రెటీలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
NMACC-Gala--event1ఆ ఫోటోలను చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాగే కొందరు ఈ ఈవెంట్ లో పెట్టిన ఆహారాన్ని షేర్ చేశారు. దాంతో ఆ ఫుడ్  ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేశంలోనే అందరికన్నా సంపన్నుడైన ముఖేష్ అంబానీ పార్టీ అంటే  మామూలుగా ఉండదు కదా. ఇక ఈవెంట్ కి వచ్చిన ప్రముఖులకు వెండి ప్లేట్స్ లో థాలీని అందించారు. పెద్ద వెండి ప్లేట్ లో రోటీలు, పాలక్ పన్నీర్, పప్పు, హాల్వా, కజ్జికాయ, లడ్డు, పాపడ్, డిజర్ట్స్ సర్వ్ చేశారు. వెండి ప్లేట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తో ఉన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.NMACC-Gala--eventAlso Read: ఏప్రిల్‌ 1నుండి అమలులోకి రానున్న కొత్త ధరలు..! ధరలు మారుతున్న వస్తువులు ఎవంటే..?

https://www.instagram.com/p/Cqj6Zp8qg9z/

 


End of Article

You may also like