ఇండియాలో ప్రతినెల మొదటి రోజు అనగా ఒకటవ తేదీన ఎన్నో మార్పులు జరుగుతాయి. అలాగే కొత్త రూల్స్ కూడా అమలులోకి వస్తుంటాయి. అలాగే వచ్చే అంటే ఏప్రిల్‌ 1వ తారీఖు నుండి అనేక మార్పులు జరగబోతున్నాయి. దానికి కారణం కొత్త ఆర్థిక ఏడాది ఈ రోజు నుంచే మొదలవుతుంది.

Video Advertisement

2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కొత్త రూల్స్, అలాగే వస్తువుల ధరలలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని వస్తువుల ధరలు తగ్గితే, మారికొన్ని వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. పాన్-ఆధార్ లింక్ మరియు ఆదాయపు పన్ను రూల్స్, మ్యూచువల్ ఫండ్స్‌ లాంటి అనేక అంశాలలో మార్పులు జరగనున్నాయి.  కొత్త రీల్స్ అనగానే ప్రజలకు గుండెల్లో అలజడి ఏర్పడుతుంది. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో అని ఆందోళన పడుతుంటారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మారినప్పుడు కొన్ని వస్తువుల రేట్లలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కేంద్ర బడ్జెట్‌లో టాక్స్‌ స్లాబ్స్‌, ఇంపోర్ట్‌ డ్యూటీలలో మార్పులు రావడంతో వస్తువుల రేట్లలో కూడా మార్పులు జరగబోతున్నాయి. ఆ వివరాల గురించి  ఇప్పుడు చూద్దాం..
goods-price-from-april-telugu-addaధరలు పెరుగే వస్తువులు ఇవే:
ధరలు పెరిగే వస్తువుల జాబితాలో హెలికాప్టర్లు, ప్రైవేటు జెట్స్‌, దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, ప్లాస్టిక్ వస్తువులు లాంటివి ఉన్నాయి. అలాగే వీటితో పాటు ప్లాటినం ధరలు, వెండి వస్తువుల ధరలు  కూడా పెరగబోతున్నాయి. ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు, ఇమిటేషన్‌ ఆభరణాలు, సిగరెట్ల ధరలు ఏప్రిల్ నెల నుండి  పెరగనున్నాయి.goods-price-from-april-5ధరలు తగ్గే వస్తువులు ఇవే:
ధరలు తగ్గే జాబితాలో వజ్రాలు, రంగు రాళ్లు, దుస్తులు, సైకిళ్లు, బొమ్మలు, టీవీల ధరలు తగ్గబోతున్నాయి. ఇక వీటితో పాటుగా కాఫీ గింజలు, ఇంగువ, శీతలీకరించిన నత్తగుల్లలు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్‌ ఫోన్లు, కెమెరా లెన్స్‌  లాంటి ఎలక్ట్రిక్‌ వస్తువులు రేట్లు తగ్గనున్నాయి. ఇండియాలో తయారయ్యే ఎలక్ట్రానిక్ వెహికిల్స్ తో పాటు పెట్రోలియం ఉత్పత్తులకు కావలసిన కొన్ని రకాల కెమికల్స్, లిథియం అయాన్ బ్యాటరీల రేట్లు తగ్గనున్నాయి.
goods-price-from-april-4 Also Read: వీరు పాన్‌ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేయనవసరం లేదు..