వీరు పాన్‌ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేయనవసరం లేదు..

వీరు పాన్‌ కార్డ్ ను ఆధార్ నంబర్ తో లింక్ చేయనవసరం లేదు..

by kavitha

Ads

కేంద్ర ప్రభుత్వం పాన్‌కార్డ్ ను ఆధార్‌ నంబర్‌ తో లింక్ చేయడానికి మార్చి 31, 2023 వరకు గడువు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.  ఇప్పటి దాకా తమ పాన్ కార్డ్ తో ఆధార్‌ కి లింక్ చేయని వారు మార్చి 31 తేదీలోగా పూర్తి చేయాలి. లేదంటే వారి పాన్ కార్డ్‌ ఉపయోగం లేకుండా పోతుంది. పాన్ కార్డ్‌ తో జరిగే  పనులు చివరి తేదీ తరువాత ఆగిపోతాయి. అలాంటి వారు తమకు పాన్ కార్డ్‌ ఉన్నప్పటికీ  దాన్ని ఉపయోగించలేరు.

Video Advertisement

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్‌తో లింకు చేసేందుకు గైడ్లైన్స్ ను రిలీజ్ చేసింది. అంతే కాకుండా ఇన్కమ్ టాక్స్ – 1961 చట్ట ప్రకారంగా  మినహాయింపు పొందిన విభాగంలోకి రాని పాన్ కార్డ్ ఉన్నవారందరు కూడా వారి పాన్‌ కార్డ్ ను ఆధార్‌తో మార్చి 31 లోపు అనుసంధానం చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. పాన్ తో ఆధార్‌ను అనుసంధానం చేయడానికి కొందరికి మినహాయింపు కూడా ఇచ్చారు. మరి పాన్‌ కార్డ్ ను ఆధార్‌తో లింక్ చేయనవసరం లేనివారు ఎవరో ఇప్పుడు చూద్దాం..
వీరికి పాన్-ఆధార్ లింక్ మినహాయింపు..
2017 మేలో కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా కొందరికి పాన్-ఆధార్ లింక్ చేయడంలో మినహాయింపును ఇచ్చారు. వారు ఎవరంటే అస్సాం, జమ్మూ&కశ్మీర్, మేఘాలయ కేంద్రపాలిత రాష్ట్రాలలో నివసించే ప్రజలు. వీరిని ఇన్కమ్ టాక్స్ – 1961 చట్ట ప్రకారంగా నాన్-రెసిడెంట్‌గా చూస్తారు. గత ఏడాది వరకు ఎనబై ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వారు పాన్-ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదు.
ఎలా పాన్ కార్డ్ ను – ఆధార్‌ నంబర్ తో లింక్ చేయాలి.. 
మీ ఇంట్లో నుండే  పాన్ కార్డ్ ను – ఆధార్ నంబర్ తో అనుసంధానం చేయవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఆన్‌లైన్ లో  ఇన్కమ్ టాక్స్  ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ అయిన incometaxindiaefiling.gov.in లో పాన్‌ కార్డ్ ను ఆధార్‌ నంబర్ తో లింక్ చేయవచ్చు.ఎస్ ఏం ఎస్ ద్వారా పాన్‌ కార్డ్ ను ఆధార్‌ నంబర్ తో లింక్ చేయవచ్చు. దీని కోసం UIDPAN < SPACE > < ఆధార్ నంబర్‌> <SPACE> < 10 డిజిట్స్ PAN> ఫార్మాట్‌ లో  567678 నంబర్ కి కానీ, 56161 నంబర్ కి కానీ SMS చేయాలి. ఆఫ్‌లైన్ లో చేయడానికి దగ్గరలో ఉండే పాన్ సేవ లేదా ఆధార్ సేవ కేంద్రంలో పాన్‌ కార్డ్ ను ఆధార్‌ నంబర్ తో లింకు చేస్తారు.

Also Read: ఈ అమెజాన్ నోటిఫికేషన్ చూసారా.. భలే ఉంటుంది కదా..?? దీని వెనుక కథేంటంటే..??


End of Article

You may also like