ఈ అమెజాన్ నోటిఫికేషన్ చూసారా.. భలే ఉంటుంది కదా..?? దీని వెనుక కథేంటంటే..??

ఈ అమెజాన్ నోటిఫికేషన్ చూసారా.. భలే ఉంటుంది కదా..?? దీని వెనుక కథేంటంటే..??

by Anudeep

అమెజాన్ సమస్త ప్రపంచంలోని అతి పెద్ద ఈ – కామర్స్ సంస్థ. 1994 లో ఈ సంస్థని ప్రారంభించారు జెఫ్ బెజోస్.. ఇంటర్నెట్ ద్వారా వ్యాపారం చేసిన మొదటి కంపెనీల్లో అమెజాన్ ఒకటి. అమెరికా లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ల్లో మొదటి 5 స్థానాల్లో ఉంటుంది ఈ కంపెనీ. ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా అమెజాన్ కంపెనీ అన్నిటిని తట్టుకొని నిలబడింది. తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ ని కూడా ప్రారంభించింది ఈ సంస్థ.

Video Advertisement

ఆన్లైన్ లో పుస్తకాలను విక్రయించాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టిన జెఫ్ బెజోస్ ఇంత పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగే క్రమం లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అమెజాన్ లో 6 లక్షల మంది ఉద్యోగులున్నారు. వారిలో చాలా మంది సంస్థని కుటుంబం లా భావిస్తారు. వారితో మంచి సంబంధాలు ఉండేలా చూసుకుంటుంది యాజమాన్యం. నా విజయం నా ఒక్కడిది కాదు.. నా ఉద్యోగులందరిది అని తరచూ చెప్తూ ఉండేవాడు మాజీ సీఈవో జెఫ్ బెజోస్..

know this thing about amazon..!!
అలాగే అమెజాన్ తన ఉద్యోగులకు ఎంత ప్రాధాన్యతని ఇస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంది..మీరు ఎప్పుడైనా అమెజాన్ వెబ్సైటు ని కానీ.. యాప్ ని కానీ వాడుతున్నపుడు.. నెట్వర్క్ సరిగ్గా లేదని ఎర్రర్ కానీ.. వేరే ఏదైనా ఎర్రర్ మెసెజ్ లు వచ్చినపుడు కొన్ని కుక్కల బొమ్మలు వస్తూ ఉంటాయి. అవి ఆ అమెజాన్ సంస్థ లో పని చేసే ఉద్యోగుల పెంపుడు కుక్కలు. వాటిని ఆఫీస్ కి తెప్పించి వాటి ఫోటోలు తీసి.. ఎర్రర్ మెసేజ్ లు వచ్చినపుడు వచ్చేలా చేసింది అమెజాన్ యాజమాన్యం. ఇలా వినూత్నం గా ఆలోచించబట్టే అమెజాన్ ప్రపంచం లోనే బెస్ట్ కంపెనీ గా ఉంది.

know this thing about amazon..!!

అన్ని సంస్థల్లాగే అమెజాన్ కి కూడా భారత్ లో పెద్ద మార్కెట్ ఉంది. ఎందుకంటే భారత్ లో మార్కెట్ శరవేగంగా పెరగటమే కారణం. ఇక్కడ గత పదేళ్ల లో ఆరున్నర బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను పెట్టింది అమెజాన్. అలాగే కోవిద్ సమయం లో కూడా అమెజాన్ లెర్నింగ్ అకాడమీ ని ప్రారంభించింది అమెజాన్.


You may also like