Ads
మనిషి ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటే ఏ వైరస్ ఏం చేయలేదు. కరోనా వైరస్ కూడా అంతే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు ఈ వైరస్ బారిన పడినప్పటికి బయటపడుతున్నారు. ఆరోగ్యపరంగా సమస్యలున్నవాళ్లు మరింత వీక్ గా మారుతూ మరణం అంచుల వరకు వెళ్తున్నరు. ఈ దిశలోనే అమెరికా ప్రయోగాలు చేసి వాక్సిన్ తయారు చేసినట్టు అమెరికా పరిశోధన సంస్ఘ ఈబయో మెడిసిన్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. వైరస్ పై పోరాటం కన్నా ముందుగా మనిషి రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా వాక్సిన్ తయారు చేశారు. దాంతో మనిషికి వైరస్ ని ఎదుర్కొనే శక్తి లబించినట్టే.
Video Advertisement
ముందుగా వీళ్లు ఎలుకల్లోకి వైరస్ ని పంపి, ఇంజక్షన్ ద్వారా యాంటీబాడీస్ ను కూడా పంపించారు. రెండు వారాలపాటు పోరాడిన ఎలుకలు , చివరికి రోగ నిరోధక శక్తి పెరగడంతో ప్రాణాలతో బయటపడ్డాయి. ఎలుకపై చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో ఇక మనుషులపై చేసేందుకు సిద్ధమవుతున్నారు. మనుషులపై ప్రయోగించడానికి ఎక్కువ సమయమే పట్టొచ్చు. కానీ ఇప్పటివరకూ వాడుతున్న మెడిసిన్ల కంటే ఇది వైరస్ ను తగ్గించడంలో వేగవంతంగా పనిచేయగలదని సైంటిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
స్పైక్ అనే ప్రోటీన్ ఈ వైరస్ కి వ్యతిరేఖంగా పనిచేస్తుందనే విషయాన్ని కనుగొన్నామని,దీంతో వైరస్ ని ఎలా ఎదుర్కోవాలో తెలిసిందని పిట్స్బర్గ్ యూనివర్శిటికి చెందిన ఆండ్రూ గాంబొట్టే ఈబయో జర్నల్ కి ఇచ్చిన ప్రకటణలో జ పేర్కొన్నరు. వీరు కనిపెట్టిన వైరల్ ప్రొటీన్ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. చర్మం ద్వారా స్పైక్ అనే ప్రొటీన్ ను శరీరానికి అందజేస్తారు. ఫలితంగా ఇమ్యూన్ రియాక్షన్ దృఢంగా మారుతుంది. ఇంతకీ ఈ స్పైక్ అనే ప్రోటీన్ ని ఏ విధంగా అందచేస్తారంటే..
బ్యాండ్ ఎయిడ్ అంత పరిమాణంలో ఉండే ప్యాచ్ లో అందులో ఉండే 400సన్నని సూదులు స్పైక్ అనే ప్రోటీన్ ను విడుదల చేస్తాయి. ఇది పూర్తిగా పంచదార, ప్రొటీన్ ల నుంచి తయారచేసిందే. చర్మంలో సింపుల్ గా కలిసిపోతుంది కూడా. శరీరంలోకి ప్రవేశించేటప్పు నొప్పికూడా అనిపించదు అని చెప్పారు గాంబొట్టే.ముందుగా స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ప్రయోగించి, ఆ తర్వాత వైరస్ తీవ్రతను బట్టి ఈ వ్యాక్సిన్ ను కనుగొన్నాం అని పేర్కొన్నారు..
ఇదే సంస్థ గతంలో సార్స్, మెర్స్ అనే కోవిడ్ లపై కూడా పనిచేసింది. దాంతో ఈ వాక్సిన్ వైరస్ నిర్మూలనకు తోడ్పడుతుందనే అందరు ఆశతో ఎదురు చూస్తున్నారు..ఈ ఫలితం సక్సెస్ అయతే కరోనా వైరస్ ప్రమాదం నుండి కొంత మేర గట్టెక్కినట్టే.. కాని మనుషులపై ప్రయోగించడానికి ఎక్కువ టైం పడుతుందని ముందే చెప్పారు కదా..దాంతో మనం మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.
End of Article