ఇప్పుడు అందరి దృష్టి ఆమెవైపే… “సరితా కోమటిరెడ్డి” గురించి ఈ విషయాలు తెలుసా?

ఇప్పుడు అందరి దృష్టి ఆమెవైపే… “సరితా కోమటిరెడ్డి” గురించి ఈ విషయాలు తెలుసా?

by Anudeep

Ads

అమెరికాకి పయనమయ్యే ఎవరిని చూసిన ఖచ్చితంగా ఐటి కొలువు గురించే అనుకుంటాం..అందునా తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్ నుండి వెళ్లేవాళ్లంటే ముందు మన మైండ్లో మెదిలే ఆలోచన సాఫ్ట్ వేర్ ఉద్యోగం గురించే..కానీ దీనికి భిన్నంగా న్యాయరంగాన్ని ఎంచుకుని అంచెలంచెలుగా ఎదిగింది సరితా కోమటి రెడ్డి.. తెలంగాణా మూలాలున్న సరితా కోమటి రెడ్డి సాధించిన ఘనతతో తెలంగాణా కీర్తి పతాక మరోమారు అమెరికాలో ఎగిరింది.

Video Advertisement

అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిగా తెలంగాణా సంతతికి చెందిన సరితా కోమటి రెడ్డి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమెను ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు..సరిత తలిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామం. భారత్ నుండి అమెరికా వెళ్లి స్థిరపడిన కుటుంబం వారిది. తల్లి గీతారెడ్డి రుమటాలజిస్ట్‌గా , తండ్రి హనుమంత్ రెడ్డి కార్డియాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నారు.  సరిత పుట్టింది, పెరిగింది అంతా అమెరికాలోనే.

చిన్నప్పటి నుండే మెరిట్ స్టూడెంట్ అయిన సరిత హార్వర్డ్ యూనివర్శిటి నుండి బిఎ డిగ్రీలోను, న్యాయశాస్త్రంలోను డిస్టింక్షన్ సాధించింది. లా కంప్లీట్ అయిన తర్వాత  లాయర్‌గా కొలంబియా సర్క్యూట్‌ అప్పీల్స్‌ కోర్ట్‌ జడ్జి బ్రెట్‌ కెవనా దగ్గర అసిస్టెంట్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది.ఆ తర్వాత అమెరికాలోని అతి పెద్ద చమురు ఉత్పత్తి కంపెనీ అయిన ‘బీపీ డీప్‌వాటర్‌ హారిజన్‌ ఆయిల్‌ స్పిల్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌’పై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌లో న్యాయసలహాదారుగా పనిచేసింది.

2018లో ‘ఇంటర్నేషనల్‌ నార్కోటిక్స్‌ అండ్‌ మనీ లాండరింగ్‌’ డిప్యూటీ చీఫ్‌గా, కంప్యూటర్‌ హ్యాకింగ్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ కోఆర్డినేటర్‌గానూ ఉన్నది. న్యూయార్క్‌ ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ జడ్జిగా నియామకానికి ముందు వరకూ న్యూయార్క్‌ ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులోని అమెరికా అటర్నీ ఆఫీస్‌ జనరల్‌ క్రైమ్స్‌ విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా పనిచేసింది.కొలంబియా లా స్కూల్‌లో న్యాయశాస్త్రం బోధించింది.

సరితా  లా ప్రాక్టిస్ స్టార్ట్ చేసిన  తొలి బాస్‌ అయిన జడ్జి బ్రెట్‌ కెవనా సిఫారసు మేరకే సరితను న్యూయార్క్‌ ఈస్టర్న్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ జడ్జిగా ట్రంప్ నియమించారని సమాచారం.. ఫిబ్రవరిలోనే జరగాల్సిన  ఈ నియామకం కోవిడ్ మహమ్మారి వలన వాయిదాపడింది. ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా సద్దుమనగడంతో ఇప్పుడు నియామకం సాధ్యమయింది.

సరితాతో పాటు మరో ఇద్దరు భారతీయ సంతతి పౌరులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాంకుకు అనుబంధంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రికన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(IBRD)కు ఆల్టర్నేట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అశోక్‌ మైఖేల్‌ పింటోని నియమించారు. మరో భారతీయ-అమెరికన్‌ మనీశా సింగ్‌ పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌(OECD) అంబాసిడర్‌గా నియమితులయ్యారు.


End of Article

You may also like