మా అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ ఓ సొగసరి కోడలు క్రెయిగ్ లిస్ట్ క్లాసిఫైడ్స్ కు ఆడ్ పంపిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అమెరికన్ సోషల్ మీడియా లో ఈ వార్త ప్రచురితమైంది. ఆమె ప్రకటన ఫన్నీ గా ఉండడం తో అందరు ఈ వార్తను చూసి నవ్వుకుంటున్నారు.

న్యూ యార్క్ కు చెందిన ఓ కోడలు ఈ ప్రకటనను ఇచ్చారు. ఆమె తన అత్తకు ఓ బాయ్ ఫ్రెండ్ అద్దెకు కావాలని కోరారు. నలభై నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్య ఉన్న వ్యక్తి అయితే బాగుంటుందని ఆమె కోరారు. ఐతే.. ఓ రెండు రోజుల పాటు అద్దెకి తీసుకుంటామని.. తాము ఓ వివాహానికి ఉమ్మడి గా వెళ్ళబోతున్నామని.. ఓ రెండు రోజుల పాటు తన అత్తతో పాటు క్లోజ్ గా ఉంటె చాలని ప్రకటన లో పేర్కొన్నారు.

american daughter in law

ఐతే, రెండు రోజులకు గాను మొత్తం 960 డాలర్లు అంటే 72 వేల రూపాయలను ఇస్తామని చెప్పారు. అంతేకాదండోయ్ బాయ్ ఫ్రెండ్ గా అప్లై చేసుకునేవారికి కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. వారికి కచ్చితం గా డాన్స్ వచ్చి ఉండాలట. అలాగే.. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలట. దీనితో ఆమె ఆడ్ కాస్తా వైరల్ అయింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మన దేశం లో నెటిజెన్ల కామెంట్లకైతే కొదవలేదు.