“పూరి జగన్నాధ్” గారు… ఇది మీరేనా..? ఏమైంది మీకు..? లైగర్ ఫ్లాప్ అవ్వడంతో ఓ ఫ్యాన్ ఎమోషనల్ పోస్ట్.!!!

“పూరి జగన్నాధ్” గారు… ఇది మీరేనా..? ఏమైంది మీకు..? లైగర్ ఫ్లాప్ అవ్వడంతో ఓ ఫ్యాన్ ఎమోషనల్ పోస్ట్.!!!

by Sainath Gopi

Ads

పూరి గారు ఇది మీరేనా? అసలు ఇలాంటి సినిమా ఎలా చేశారు? ఈ సినిమాకి దర్శకుడు మీరే అంటే ఆశ్చర్యంగా ఉంది. మీ రేంజ్ ఇది కాదు. మీ సినిమాలు ఇవి కావు. ఇడియట్, పోకిరి, బద్రి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి ఎన్నో చిత్రాలను తక్కువ సమయంలో చిత్రీకరించి ఘన విజయం సాధించిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ గారు ఇలాంటి సినిమా తీసారా?

Video Advertisement

ఒకప్పుడు దర్శక దిగ్గజాలు అయిన సుకుమార్ గారు, రాజమౌళి గారు, వి.వి. వినాయక్ గారు మీ సినిమాలు వస్తున్నాయి అంటే భయపడే వారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి మీకు ఇప్పుడు ఏమయ్యింది? విజయేంద్ర ప్రసాద్ లాంటి దిగ్గజ రచయితలు సైతం మిమ్మల్ని చూసి ఈర్ష్య పడిన సందర్భాలు లేకపోలేదు. అంతటి సృజనాత్మక దర్శకుడు ఇలాంటి సినిమా తీశారా ?

ఒక మంచి నటుడిని ఒక సూపర్ స్టార్ చేసారు, సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ గారికి సర్కార్ లాంటి అద్భుతమైన విజయాన్ని అందించారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు మీ ఖాతాలో ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పుడు డీలా పడుతున్నారో అర్థం కావట్లేదు. ఒకప్పుడు మీ హీరోలు అంటే చాలా రఫ్ గా ఉంటారు, మాస్ గా ఉంటారు అని అనుకున్నాం. హీరో అంటే అంతా మంచితనం మాత్రమే కాదు. ఇలా కూడా ఉంటారు అని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకులు మీరు.

మీ సినిమాల్లో నటించిన హీరోలు అందరూ కూడా ఆ సినిమాతో ఒక కొత్త ఇమేజ్ సంపాదించుకున్నారు. బిజినెస్ మాన్ సినిమా తర్వాత కొన్ని సినిమాల ఫలితాలు అటు ఇటు అయ్యాయి. అనుకున్నంత బాగా కొన్ని ఆడలేదు. సరేలే సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఇదంతా కామన్ కదా అనుకున్నాం. తర్వాత టెంపర్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. ఇది కదా పూరి సినిమా అంటే అని అనుకున్నాం. ఇంక తర్వాత సినిమాలు అన్ని మామూలుగా ఉండవు అని ఆనందపడ్డాం.

pawan-puri-jaganandh-movie-producer

కానీ తర్వాత కూడా మళ్లీ అలాంటి సినిమాలే చేశారు. ఇస్మార్ట్ శంకర్ కూడా మీ రేంజ్ హిట్ కాకపోయినా పర్వాలేదు పూరి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. నెక్స్ట్ సినిమా కచ్చితంగా అదరగొడతారు అని అనుకున్నాం. మీరు కూడా ఇలాంటి సినిమాలు చేస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది పూరి గారు. కావాలంటే కొంత కాలం బ్రేక్ తీసుకోండి. మళ్లీ ఒక మంచి సినిమాతో కం బ్యాక్ ఇవ్వండి. అంతే కానీ ఇలాంటి సినిమాలు మాత్రం చేయకండి. మా వల్ల కావట్లేదు. మళ్లీ ఇది పూరి రేంజ్ సినిమా అని చెప్పే రోజు రావాలి అని ఆశిస్తున్నాం.


End of Article

You may also like