కొడుకు మరణానికి కోడలే కారణం అనే అనుమానంతో.. ఈ అత్తమామలు ఏం చేసారంటే..!?

కొడుకు మరణానికి కోడలే కారణం అనే అనుమానంతో.. ఈ అత్తమామలు ఏం చేసారంటే..!?

by Anudeep

ఘంటసాల గారు పాడిన అత్త లేని కోడలుత్తమురాలు ఓయమ్మా.. కోడల్లేని అత్త గుణవంతురాలు ఓయమ్మా.. ఆహూ ఊహూ.. ఈ పాట అందరికి గుర్తుండే ఉంటుంది. కోడలు ఎంత ఉత్తమురాలైనా అత్త మెప్పు పొందడం అరుదు. అదే అత్త లేని ఇంట్లో కోడలిదే పెత్తనం కాబట్టి ఇక ఆమెకు ఎదురేముంటుంది? కోడలు కాపురానికి రానంతవరకూ అత్తలందరూ గుణవంతులే.. కోడలు వస్తే గానీ అత్తల గుణం బయట పడదు.

Video Advertisement

ఇద్దరి మధ్య పరస్పర మనస్పర్థలు రావడం, ఒకరిపై మరొకరు దూషణలకు దిగటం ఇప్పుడు కామన్. కానీ కొడుకు చనిపోయిన తరువాత కోడలిపై ఓ అత్త తన పైశాచికత్వాన్ని బయటపెట్టింది. ఇంట్లోకి రావొద్దంటూ బయటకు గెంటేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే… ఉమ్మడి చిత్తూరి జిల్లా పీలేరు పట్టణంలోని పాలాల విధికి చెందిన కుమార్ ఆచారి సరళ దంపతుల కుమారుడు హరి ప్రసాద్ కు హైదరాబాద్ కవాడిగుడాకి చెందిన స్వర్ణలతకు 13 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి పల్లవి (12), సంతోష్ (11) సంతానం. గత నాలుగేళ్లుగా హరిప్రసాద్ ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారు. వైద్యం చేయించుకున్నా హరి ప్రసాద్ ఆరోగ్యం కుదుట పడలేదు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

representative image

అప్పటి నుంచి స్వర్ణ అత్తగారి ఇంటి వద్దే ఉంటోంది. కొడుకు చనిపోయిన కొన్నాళ్ల నుంచి కోడలిపై అనుమానం పెంచుకున్నారు అత్తమామలు. కోడలు ఎవరితోనో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నారు. ముందుగా కన్నా బిడ్డలను దూరం చేయాలనీ ప్లాన్ వేశారు. అనుకున్నట్టే స్వర్ణ కన్నబిడ్డలకు లేని పోని మాటలు చెప్పేవారు. తల్లి గురించి పిల్లలకు చెడుగా చెప్పి ఆమెపై మనసు విరిగిపోయేలా చేశారు. ఆ తర్వాత స్వర్ణను వేధించడం ప్రారంభించారు.

representative image

నీవల్లే మా కొడుకు చనిపోయాడంటూ నిందలు మోపేవారు. పిల్లల కోసం అన్నీ భరిస్తూ వచ్చిన స్వర్ణ అత్తారింటిలోనే ఉండేది. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని, పెట్టేబేడా సర్ది బయటకు తరిమేశారు. ఇంట్లోకి వెళ్లకుండా లోపల తాళాలు వేసేసారు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న స్వర్ణ అత్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. కన్నబిడ్డలనైనా తన దగ్గరకు చేర్చాలని వేడుకుంటోంది స్వర్ణ.


You may also like