ప్రియుడితో పారిపోయింది… తల్లికి దొరికిపోయింది..! కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..?

ప్రియుడితో పారిపోయింది… తల్లికి దొరికిపోయింది..! కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..?

by Anudeep

Ads

ఈ తరం యువత  ప్రేమకు ఎంత విలువ ఇస్తారో వేరే చెప్పనవసరం లేదు. ప్రేమ కోసం ఈ లోకాన్నే మరిచిపోతారు. తమ ప్రేమను గెలిపించడం కోసం తమ పెద్దలతో సైతం యుద్ధం చేయడానికి కూడా వెనకాడరు. ఎన్నో కష్టాలు పడైనాసరే ఎలాగోలా తమ ప్రేమని సక్సెస్ చేసుకోవడానికే చూస్తారు.

Video Advertisement

ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన ప్రేమ కథ బీహార్ లో జరిగింది. బీహార్ రాజధాని పాట్నా శివారులో దానాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బెల్ఖెడా గ్రామానికి చెందిన సత్యేంద్ర పండిట్ కుమారుడు అనిల్ అగర్వాల్ మరియు పాట్నా జిల్లాలోని ఖేరిమోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి గ్రామానికి చెందిన యోగేంద్ర పండిత్ కుమార్తె ఇందు ఒక వివాహ వేడుకలో కలుసుకున్నారు. కొంతకాలానికి వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది.

వివాహ బంధంతో ఒక్కటవ్వాలని  వీళ్ళ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పారు ఇందు మరియు అనిల్. అయితే కుటుంబసభ్యులు వీళ్ళ ప్రేమను అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటిలో నుంచి పారిపోవడానికి నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్లాన్ ప్రకారం గత ఆదివారం రాత్రి ఇందు ఇంటికి చేరుకున్నాడు అనిల్. అనిల్ తో కలిసి ఇంటిలో నుంచి ఇందు పారిపోవడం ఆమె తల్లి గమనించి వాళ్లను వెంబడించింది.  వాళ్ళ వెనకే వెంబడిస్తూ ఇద్దరిని పట్టుకొని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విన్న గ్రామ ప్రజలు అక్కడికి చేరుకొని, వాళ్ళ ఇద్దరి కోరికను తెలుసుకున్నారు.

representative image

వాళ్ళిద్దరు ఇష్టం మేరకు గ్రామంలోని అమ్మవారి సాక్షిగా వివాహం చేశారు. ఈ పెళ్ళికి ఇందు తల్లి సాక్షిగా నిలిచింది. ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారమే స్థానికంగా గ్రామంలో హాట్ టాపిక్ గా నిలిచింది.


End of Article

You may also like