మరొకరితో పెళ్లి జరుగుతోంది అని యువతిని ఎత్తుకెళ్లిన ప్రేమికుడు..! కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..?

మరొకరితో పెళ్లి జరుగుతోంది అని యువతిని ఎత్తుకెళ్లిన ప్రేమికుడు..! కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..?

by Anudeep

Ads

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ లో ఒక యువతిని వందమంది దాడి చేసి కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో ఆరు గంటల్లోనే ఆ యువతిని కాపాడారు పోలీసులు. ఆమె తన తండ్రికి చేసిన ఫోన్ కాల్ ఆధారంగా.. నల్గొండలో ఉన్నట్లు గుర్తించి రెస్క్యూ చేసారు. అయితే ఈ కేసు లో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసు లో ఇప్పటికే 32 మందిని అరెస్టు చేసారు.

Video Advertisement

 

ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. ” ఔటర్ రింగ్ రోడ్ సమీపం లోని బెంగళూరు స్పోర్ట్స్ అకాడమీ లో వైశాలి తో నవీన్ రెడ్డి కి పరిచయం అయ్యింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని ఫోటోలు దిగాడు. కొన్ని రోజుల తర్వాత వైశాలి తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పారు. దీంతో ఆమె తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ ప్రయత్నించారు. తన బంధువులను కూడా వైశాలి ఇంటికి పంపించారు. వారు పెళ్ళికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకొని, నకిలీ ఇంస్టాగ్రామ్ ఖాతా తెరచి వారిద్దరి ఫోటోలు వైరల్ చేసాడు.

details of manneguda woman kidnap case..

తర్వాత వైశాలి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకొని తన వ్యాపారాన్ని కొనసాగించాడు. కొన్ని రోజులకు వైశాలికి మంచి సంబంధం రావడంతో డిసెంబర్ 9 న నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్, వైశాలిని అపహరించి పెళ్లి చేసుకోవాలని భావించాడు. దీంతో వంద మందితో ఆమె ఇంటిపై దాడి చేసి, ఆమె బంధువులను గాయపరచి, ఆమెను అపహరించాడు. నవీన్ కొట్టడం తో వైశాలికి గాయాలయ్యాయి. అనంతరం ఆమెను పోలీసులు వెతుకుతున్నారని తెలిసి నల్గొండలో విడిచి పెట్టారు. నిందితులు అందరూ పారిపోయారు. తర్వాత ఆమె ఫోన్ చేయడంతో పోలీసులు వెళ్లి ఆమెను తీసుకొచ్చారు” అని పోలీసులు వెల్లడించారు.

 

details of manneguda woman kidnap case..
మరోవైపు నవీన్ రెడ్డి వైశాలి తో 2021 ఆగస్టు 4వ తేదీన తనకు వివాహం జరిగిందని తెలిపాడు. ఆమె కుటుంబం తన డబ్బులు చాలా ఖర్చు పెట్టించినట్లు పేర్కొన్నాడు. అని నవీన్ రెడ్డి కోర్టుకు తెలుపగా.. అవన్నీ అబద్ధాలని వైశాలి తెలిపింది. అంతే కాకుండా నవీన్ రెడ్డి పై గతం పలు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.


End of Article

You may also like