Ads
ప్రపంచం మొత్తం టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంటే.. కొందరు మాత్రం మూఢనమ్మకాలను ఇంకా నమ్ముతుంటారు. ఎవరు ఏ మాయమాటలు చెప్పినా మూఢనమ్మకాల భ్రమలోపడి వెంటనే ఆ పని చేస్తారు. ఇప్పుడు ఇలాంటిదే ఒక కథ వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన కొర్లగుంట అబ్బన కాలనీలో నివాసముంటున్న శివప్రసాద్ టీటీడీలో కాంటాక్ట్ ఉద్యోగం భార్యా పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు అనుకోని సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Video Advertisement
అసలు వివరాల్లోకి వెళితే అప్పన్న కాలనీలో గత మూడు రోజులుగా ఇద్దరు మహిళలు గోల్డ్ కవరింగ్ నగలు అమ్ముకుంటూ.. ఎవరికైనా ఎటువంటి కష్టాలు ఉన్నా మంత్రాలతో మాయచేస్తాము అని అందరినీ నమ్మించారు. ఈ క్రమంలో శివప్రసాద్ కుటుంబాన్ని కూడా మాయమాటలతో వలలో వేసుకున్నారు. మీ ఇంటిలో దుష్టశక్తులు ఉన్నాయి. మీరు అందుకే కష్టాలు పడుతున్నారు. మిమ్మల్ని అదృష్టం వరించాలంటే మీ ఇంటిలో కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి అంటూ మాయమాటలతో వాళ్లను వలలో వేసుకున్నారు.
ఆ మాయ లేడి చెప్పిన విధంగానే శివప్రసాద్ కుటుంబం ప్రత్యేక పూజలు సిద్ధమై ఆమెను ఇంటిలోకి రప్పించారు. ఏవేవో పూజలు చేస్తూ ఇల్లంతా తిరుగుతూ గట్టి గట్టిగా మంత్రాలు చదువుతూ హడావిడి చేసింది. ఈ క్రమంలోనే మీ ఇంట్లో ఉండే బంగారు నగలు, వెండి ఆభరణాలు, ఐదు వేల రూపాయలు పూజలో ఉంచండి అని చెప్పింది. చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుందని నమ్మబలికింది.
దీంతో శివప్రసాద్ కుటుంబం ఆమె చెప్పిన మాటలకు నమ్మి నగలు డబ్బులు బాక్స్ లో ఉంచి పూజలో పెట్టారు. కాసేపు వాళ్ళు నమ్మించడానికి ఏవేవో మంత్రాలు చదువుతూ నటించింది. పూజ పూర్తయింది గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి రండి మీ బాధలన్నీ తొలగిపోతాయి అంటూ నమ్మబలికింది. శివప్రసాద్ కుటుంబాన్ని బయటికి వెళ్ళగానే మంత్రగత్తె తోపాటు తెచ్చుకున్నా బాక్సు అక్కడ పెట్టి, డబ్బు, నగలు ఉన్న బాక్స్నీ ఒక ఎర్రని గుడ్డలో చుట్టుకొని పరార్ అయింది.
గుడి నుంచి తిరిగి వచ్చిన శివప్రసాద్ కుటుంబం మంత్రగత్తె అక్కడ లేకపోవడంతో అనుమానం వచ్చి పూజలో పెట్టిన బాక్సులు తెరవడానికి ప్రయత్నించారు. ఎంతకీ ఆ బాక్స్ తెరుసుకోకపోవడంతో దాన్ని పగలగొట్టి చూస్తే దానిలో బియ్యం ఒక రూపాయి ఉన్నాయి. ఈ విషయంతో ఖంగుతిన్న శివప్రసాద్ కుటుంబ సభ్యులు వెంటనే ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించి ఏదో విధంగా ఆమెను పట్టుకొని తమ నగదును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.
End of Article