Ads
సాంకేతిక పరం గా ఎంత అభివృద్ధి చెందినా.. ఇంకా మూఢ నమ్మకాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మంత్రాలూ, తంత్రాల గీతలను దాటి బయటకు రాలేకపోతున్నాం. ఇటీవల చనిపోయిన ఓ వ్యక్తిని తిరిగి పూజలతో బతికిస్తాను అంటూ ఓ వ్యక్తి శవం వద్దే పూజలు చేస్తున్న ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, జగిత్యాల రూరల్ మండలం టిఆర్ నగర్ లో ఓర్సు రమేష్ అనే ఓ వ్యక్తి మరణించాడు. అయితే పుల్లయ్య అనే వ్యక్తి చదివిన మంత్రాల వల్లనే రమేష్ చనిపోయాడంటూ.. ఆ వ్యక్తి కుటుంబసభ్యులు, సన్నిహితులు పుల్లయ్యను చావబాదారు. ఆ దెబ్బలను తట్టుకోలేని పుల్లయ్య తన మంత్రాల వల్లనే రమేష్ చనిపోయాడని.. తిరిగి పూజలతో బతికిస్తానని ఉదయం నుంచి పూజలు చేస్తూ ఉన్నాడు.
దీనితో.. ఈ విషయం పోలిసుల వరకు వెళ్ళింది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పుల్లయ్య ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే.. రమేష్ మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. మరో వైపు పుల్లయ్యను పోలీసులు తీసుకెళ్లిపోవడం తో రమేష్ కుటుంబ సభ్యులు ధర్నా కు దిగారు. రోడ్డు పై ట్రాఫిక్ కూడా స్తంభించింది. దీనితో పోలీసులు రంగం లోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడల్లా.. ఈరోజుల్లో కూడా ఇలాంటి నమ్మకాలూ ఉంటాయా అనిపిస్తోంది కదా.. ప్రపంచం ఎటు వెళ్తోంది..? మనం ఎటు పోతున్నాం అన్న సందేహాలు కూడా కలుగుతుంటాయి.
End of Article