Ads
మనం రోజు టీవీలో చూసే సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలా సెలబ్రిటీస్ రియల్ లైఫ్ ని చూపించిన ప్రోగ్రాం బిగ్ బాస్. హిందీ (2006), కన్నడ (2013), బెంగాలీ (2013) లో చాలా హిట్ అయిన ఈ కార్యక్రమం తెలుగులో ఎలా ఉంటుందో అని మొదట్లో కొంచెం సంకోచం ఉండేది కానీ తెలుగులో కూడా ఊహించని విధంగా స్పందన వచ్చింది. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ లో నాని, మూడవ సీజన్, ఇంకా నాలుగవ సీజన్ లో నాగార్జున తమ హోస్టింగ్ తో బిగ్ బాస్ షోని జనాలకి ఇంకా చేరువయ్యేలా చేశారు.
Video Advertisement
చాలామంది షో కి కనెక్ట్ కావడానికి ముఖ్య కారణాలు వాళ్ల ఎమోషన్స్. నిజంగా కొంతమంది మనుషులని ఒకటే ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచితే, వాళ్ళ చేత అన్ని పనులు చేయిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఈ షో కాన్సెప్ట్ లో ఒక భాగం. కానీ వాళ్ళు అలా రియాక్ట్ అవ్వడం ఫేక్ అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ స్క్రిప్టెడ్ అని ఎంతో మంది అంటుంటారు.
ఈ విషయం పక్కన పెడితే ఇటీవల బిగ్ బాస్ ఎపిసోడ్ లో జరిగిన ఒక విషయం గమనిస్తే షో లో జరిగిన విధంగా టీవీ లో టెలికాస్ట్ చెయ్యరేమో అని అనిపిస్తుంది. గత శనివారం ఎపిసోడ్ లో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం ఎపిసోడ్ మొదలయ్యేటప్పటికే టాస్క్ లో ఫిమేల్ గెటప్ వేసిన మేల్ కంటెస్టెంట్స్ అందరూ గడ్డాలు మీసాలు తీసేసి ఉన్నారు.
కానీ మనకి చూపించిన దాని ప్రకారం టాస్క్ తర్వాత జరిగింది. నిజానికి గమనిస్తే ముందు టాస్క్ జరిగింది. తర్వాత స్వాతి దీక్షిత్ స్టేజ్ మీదకు వచ్చి మాట్లాడారు అని అర్థమవుతుంది. టీవీ షో అన్న తర్వాత ఎడిట్ అవుతుంది. అది అందరికీ తెలుసు. కానీ ఎడిటింగ్ లో అప్పుడప్పుడు ఇలాంటివి కనిపిస్తుంటాయి, దాంతో ప్రేక్షకులు కూడా ఎక్కడ ఎడిటింగ్ జరిగింది అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు అంతే.
End of Article